Telangana Lok Sabha Election 2024 Voting Live: హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్.. మజ్లీస్‌కు మాధవి లత స్ట్రాంగ్ వార్నింగ్

Telangana Lok Sabha election 2024 Phase 4 Voting Live: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయగా.. భారీ బందోబస్తు నడుమ పోలింగ్ నిర్వహించనున్నారు. 3.32 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్ లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Written by - Ashok Krindinti | Last Updated : May 13, 2024, 06:22 PM IST
Telangana Lok Sabha Election 2024 Voting Live: హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్.. మజ్లీస్‌కు మాధవి లత స్ట్రాంగ్ వార్నింగ్
Live Blog

Telangana Lok Sabha Election Voting Live Updates: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సర్వసిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. సమస్యాత్మకమైన 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు పోటీలో పడుతున్నారు. మొత్తం 3.32 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనుండగా.. 35,809 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 9,900 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఈసీ.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది ఈవీఎం, వీవీప్యాట్‌ యంత్రాలతో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి. 

 

13 May, 2024

  • 18:22 PM

    TS Lok Sabha Election 2024 Polling Live Updates: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిలుచున్న వారందరికి ఓటు హక్కు వేసే అవకాశం కల్పించనున్నారు.
     

  • 17:52 PM

    TS Lok Sabha Election 2024 Polling Live Updates: జహీరాబాద్ పార్లమెంట్  స్థానంలో  సాయంత్రం 5 గంటల వరకు 71.91 శాతం పోలింగ్ నమోదు.

    మెదక్ పార్లమెంట్ వ్యాప్తంగా సాయంత్రం ఐదు గంటల వరకు 71.33 శాతం పోలింగ్ నమోదు

  • 17:42 PM

    TS Lok Sabha Election 2024 Polling Live Updates: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆదిలాబాద్ -69.81 శాతం, భువనగిరి -62.34 శాతం, చేవెళ్ల -53.15 శాతం, హైదరాబాద్‌-39.17 శాతం, కరీంనగర్-67.67 శాతం, ఖమ్మం-70.76 శాతం, మహబూబాబాద్-68.60 శాతం,  మహబూబ్‌నగర్-68.40 శాతం, మల్కాజిగిరి-46.27 శాతం, మెదక్-71.33 శాతం, నాగర్ కర్నూల్ -66.53 శాతం, నల్గొండ-70.36 శాతం, నిజామాబాద్-67.96 శాతం, పెద్దపల్లి-63.86 శాతం, సికింద్రాబాద్‌ -42.48 శాతం, వరంగల్-64.08 శాతం, జహీరాబాద్-71.91 శాతం నమోదు.. సికింద్రబాద్ కంటోన్మెంట్ లో 47.88 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • 17:31 PM

    Hyderabad Lok Sabha Election 2024 Live Updates: హైదరాబాద్ పాతబస్తీలో టెన్షన్ వాతావరణం తలెత్తింది. భవానీనగర్ పీఎస్ పరిధిలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత ఎదురెదురుగా వచ్చారు. ఈ క్రమంలో ఎంఐఎం కార్యకర్తలు మాధవి లతపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను మాధవి లత తన ఫోన్‌లో రికార్డు చేశారు. ఎంఐఎం కార్యకర్తల తీరుపై మాధవి లత ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లీస్ కార్యకర్తలకు మధవి లత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

     

  • 17:17 PM
  • 16:44 PM

    Telangana Lok Sabha Election 2024 Voting Live: జూబ్లీక్లబ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు రామ్‌ చరణ్, ఉపాసన దంపతులు. 'అందరూ బయటకు రండి.. ఓటు హక్కు వినియోగించుకోండి.. యువకులు అధికంగా ఓటు వేయాలి.. ఆదర్శంగా నిలవండి.. ' అని రామ్‌ చరణ్‌ కోరారు.

  • 16:30 PM

    Telangana Lok Sabha Election 2024 Voting Live: తెలంగాణలోని 5 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలలోపు క్యూలైన్లలో వేచి ఉన్న వారికి ఓటేసేందుకు అవకాశం ఉంటుంది.
     

  • 16:29 PM

    Hyderabad Lok Sabha Election 2024 Live Updates: హైదరాబాద్‌లో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. గ్రేటర్ పరిధిలో మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ శాతం 25 శాతం దాటలేదు. జిల్లాల్లో భారీగా పోలింగ్ నమోదవుతున్నా.. గ్రేటర్ పరిధిలో మాత్రం ఓటర్లు ముందుకు రాలేదు. మధ్యాహ్నం 1 గంట వరకు మల్కాజ్ గిరి పార్లమెంట్‌లో 28 శాతం, చేవెళ్ల పార్లమెంట్ లో 35, సికింద్రాబాద్ లో 25 శాతం పోలింగ్ నమోదు కాగా.. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రం కేవలం 20 శాతం పోలింగ్ నమోదైంది.  గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్ పరిధిలో దాదాపు 50 శాతం నమోదైంది. ఈసారి అంతకంటే తక్కువ పోలింగ్ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. 
     

  • 15:42 PM

    Telangana Lok Sabha Election 2024 Voting Live: మధ్యాహ్నం మూడు గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 52.30 శాతం పోలింగ్ నమోదైంది.

  • 15:35 PM

    Telangana Lok Sabha Election 2024 Voting Live: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 గంటలకు 62.32 శాతం పోలింగ్ నమోదైంది. మహబుబాబాద్ పార్లమెంట్ పరిధిలో పినపాక 60.68%, భద్రాచలం 60.58%, ఇల్లందు 61.86% శాతం నమోదవ్వగా.. ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో  కొత్తగూడెం 60.92%, అశ్వరావుపేట 68.88 శాతం మంది ఓటు వేశారు.

  • 15:27 PM

    Telangana Lok Sabha Election 2024 Voting Live: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల వరకు 55.92 శాతం పోలింగ్ నమోదైంది. 

    అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం

    ==> పెద్దపల్లి నియోజకవర్గం: 55.06 శాతం 
    ==> మంథని నియోజకవర్గం : 56.02 శాతం 
    ==> రామగుండం నియోజకవర్గం: 47.10 శాతం 
    ==> చెన్నూరు నియోజకవర్గం: 58.65 శాతం 
    ==> బెల్లంపల్లి నియోజకవర్గం: 63.00 శాతం 
    ==> మంచిర్యాల నియోజకవర్గం: 52.97 శాతం 
    ==> ధర్మపురి నియోజకవర్గం: 60.23 శాతం

     

  • 15:01 PM

    Telangana Lok Sabha Election 2024 Voting Live: ఉప్పల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వెళ్లిన మహిళ గుండె పోటుతో మృతి చెందింది. ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి భరత్ నగర్‌కి చెందిన విజయ లక్ష్మి ఒక్కసారిగా కిందపడిపోగా.. పోలింగ్ సిబ్బంది, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

  • 14:52 PM

    Telangana Lok Sabha Election 2024 Voting Live: తెలంగాణలో ఒకట్రెండు ఘటనలు మినహా పోలింగ్‌  ప్రశాంతంగా సాగుతుందని సీఈవో వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. మధ్యాహ్నం 1 గంట వరకు 40 శాతంపైగా పోలింగ్‌ నమోదు అయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే 3.4 శాతం ఎక్కువ పోలింగ్‌ నమోదైందని చెప్పారు. పలువురిపై ఫిర్యాదులు వచ్చాయని.. విచారణ చేపడతామన్నారు.

  • 14:04 PM

    Telangana Lok Sabha Election 2024 Voting Live: హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు చేశారుమలక్‌పేట్‌ పోలీసులు. పోలింగ్‌ బూత్‌లో ముస్లిం మహిళల హిజాబ్‌ తొలగించి అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
     

  • 14:01 PM

    Telangana Lok Sabha Election 2024 Voting Live: హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు చేశారుమలక్‌పేట్‌ పోలీసులు. పోలింగ్‌ బూత్‌లో ముస్లిం మహిళల హిజాబ్‌ తొలగించి అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.

  • 13:57 PM

    TS Lok Sabha Election 2024 Polling Live Updates: మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెలంగాణ వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం 40.38.

    పార్లమెంట్ సెగ్మెంట్‌ల వారీగా.. 

    ==> ఆదిలాబాద్ 50.18%
    ==> భువనగిరి 46.49%
    ==> చేవెళ్ల 34.56%
    ==> హైదరాబాద్ 19.37% 
    ==> కరీంనగర్ 45.11%
    ==> ఖమ్మం 50.63%
    ==> మహబూబాబాద్ 48.81%
    ==> మహబూబ్ నగర్ 45.84%
    ==> మల్కజ్ గిరి 27.69%
    ==> మెదక్ 46.72%
    ==> నాగర్ కర్నూల్ 45.88%
    ==> నల్గొండ 48.48%
    ==> నిజామాబాద్ 45.67%
    ==> పెద్దపల్లి 44.87%
    ==> సికింద్రాబాద్ 24.91%
    ==> వరంగల్ 41.23%
    ==> జహీరాబాద్ 50.71%

  • 13:48 PM

    TS Lok Sabha Election 2024 Polling Live Updates: తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

  • 12:28 PM

    TS Lok Sabha Election 2024 Polling Live Updates: ఓల్డ్ సిటీలో బీజేపీ అభ్యర్ధి మాధవీలత రచ్చ చేశారు. పోలింగ్ బూత్‌లో ఓటింగ్‌ను పరిశీలిస్తున్న మాధవీలత.. MIM పార్టీ ఏజెంట్ బురుఖాను చెక్ చేశారు. అంతే కాదు ఎక్కడైనా తప్పు జరిగితే తగ్గేదే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓల్డ్ సిటీలో ప్రశాంతంగా ఓటింగ్ జరగాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 12:20 PM

     TS Lok Sabha Election 2024 Polling Live Updates: జహీరాబాద్ పార్లమెంట్ వ్యాప్తంగా 11 గంటల వరకు  31.83 శాతం పోలింగ్ నమోదు

     మెదక్ పార్లమెంట్ వ్యాప్తంగా 11 గంటల వరకు 28.32 శాతం పోలింగ్ నమోదు

  • 12:06 PM

    TS Lok Sabha Election 2024 Polling Live Updates: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉదయం గం.11 గంటల వరకు 26.33 శాతం పోలింగ్ నమోదు అయింది.

  • 12:04 PM

    TS Lok Sabha Election 2024 Polling Live Updates: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో ఉండగా గుండెపోటుతో ఉద్యోగి శ్రీకృష్ణ మృతి చెందారు. అశ్వారావుపేట పరిధిలోని నెహ్రూనగర్‌ పోలింగ్‌బూత్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

  • 11:51 AM

    TS Lok Sabha Election 2024 Polling Live Updates: సీఎం రేవంత్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. 

  • 11:49 AM

    TS Lok Sabha Election 2024 Polling Live Updates: ఉదయం 11 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం 24.31.

    పార్లమెంట్ సెగ్మెంట్‌ల వారీగా..  

    ==> ఆదిలాబాద్ 31.51%
    ==> భువనగిరి 27.97%
    ==> చేవెళ్ల 20.35%
    ==> హైదరాబాద్ 10.70% 
    ==> కరీంనగర్ 26.14%
    ==> ఖమ్మం 31.56%
    ==> మహబూబాబాద్ 30.70%
    ==> మహబూబ్ నగర్ 26.99%
    ==> మల్కజ్ గిరి 15.05%
    ==> మెదక్ 28.32%
    ==> నాగర్ కర్నూల్ 27.74%
    ==> నల్గొండ 31.21%
    ==> నిజామాబాద్ 28.26%
    ==> పెద్దపల్లి 26.17%
    ==> సికింద్రాబాద్ 15.77%
    ==> వరంగల్ 24.18%
    ==> జహీరాబాద్ 31.83%

  • 11:41 AM

    TS Lok Sabha Election 2024 Polling Live Updates: సిద్దిపేట రూరల్ మండలం  చింతమడక గ్రామంలో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.

  • 11:37 AM

    TS Lok Sabha Election 2024 Polling Live Updates: నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉదయం 11 గంటల వరకు 31.21 శాతం పోలింగ్ నమోదైంది. నల్గొండ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మోరాయించడంతో ప్రత్యామ్నాయంగా ఈవీఎంలను ఏర్పాటు చేసి పోలింగ్‌లో ప్రారంభించారు ఎన్నికల అధికారులు. రెండు పార్లమెంటు పరిధిలో 35 లక్షల మందిపైగా ఓటర్లు ఉండడంతో 4200 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల నిర్వహణను అధికారులు పరిశీలిస్తున్నారు.  

  • 10:57 AM

    Telangana Lok Sabha Election 2024 Voting Live: సిద్దిపేటలోని అంబిటస్‌ స్కూల్‌లో తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ మంత్రి హరీశ్‌రావు. 

  • 10:49 AM

    Telangana Lok Sabha Election 2024 Voting Live: దేశవ్యాప్తంగా హైదరాబాద్ పోలింగ్‌పై ఆసక్తి నెలకొంది. గతంలో ఎప్పుడు లేనట్లుగా ఈసారి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి గట్టి పోటీ ఇస్తున్నారు బీజేపీ అభ్యర్థి మాధవీలత. ఈ క్రమంలో పాతబస్తీలో భారీగా  పోలీసు బలగాలను మోహరించారు. పాతబస్తీ గల్లీల్లో కేంద్ర బలగాలను కూడా దింపారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అత్తాపూర్‌ లోని శాస్త్రీపురంలో అసదుద్దీన్‌ ఓవైసీ ఓటు వేయనున్నారు. 

  • 10:41 AM

    Telangana Lok Sabha Election Polling Live Updates: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఓటు వేయడానికి  హుస్నాబాద్ బస్ స్టాప్ నుంచి కరీంనగర్ వెళ్లే బస్సులో ప్రయాణించి జూనియర్ కాలేజీ స్టాప్  వరకు కుటుంబ సభ్యులతో  కలిసి ప్రయాణించారు. అనంతరం జూనియర్ కాలేజీలో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 10:21 AM

    Telangana Lok Sabha Election Polling Live Updates: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింతల గడ్డ గ్రామ పంచాయితీ ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామ పంచాయతీకి పోలింగ్ కేంద్రాన్ని కేటాయించకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి చేరుకున్న స్థానిక తహసీల్దార్, ఎస్ఐలు గ్రామ ప్రజలకు సముదాయించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

  • 09:56 AM

    Telangana Lok Sabha Election Polling Live Updates: ఉదయం 9 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం 9.51%.

    పార్లమెంట్ సెగ్మెంట్‌ల వారీగా.. 

    ==> ఆదిలాబాద్ 13.22%
    ==> భువనగిరి 10.51%
    ==> చేవెళ్ల 8.29%
    ==> హైదరాబాద్ 50.06% 
    ==> కరీంనగర్ 10.23%
    ==> ఖమ్మం 12.24%
    ==> మహబూబాబాద్ 11.94%
    ==> మహబూబ్ నగర్ 10.33%
    ==> మల్కజ్ గిరి 6.20%
    ==> మెదక్ 10.99%
    ==> నాగర్ కర్నూల్ 9.81%
    ==> నల్గొండ 12.80%
    ==> నిజామాబాద్ 10.91%
    ==> పెద్దపల్లి 9.53%
    ==> సికింద్రాబాద్ 5.40%
    ==> వరంగల్ 8.97%
    ==> జహీరాబాద్ 12.88%

  • 09:09 AM

    Telangana Lok Sabha Election Polling Live Updates: నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ సతీసమేతంగా ఉదయం 8.30 గంటలకు తన ఓటును కాకతీయ కళాశాలలోనీ పోలింగ్ కేంద్రంలో వేశారు.

  • 08:55 AM

    Telangana Lok Sabha Election Polling Live Updates: జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. 

  • 08:51 AM

    Telangana Lok Sabha Election Polling Live Updates: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట గ్రామంలో PS90 ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ మొదలు కాలేదు.
     

  • 08:27 AM

    Telangana Lok Sabha Election Polling Live Updates: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. 40 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ మొదలైంది.
     

  • 08:17 AM

    Telangana Lok Sabha Election Polling Live Updates: సినీ ప్రముఖులు ఉదయాన్నే ఓటు వేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యామిలీలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లూఅర్జున్, సినీ దర్శక రచయిత పరుచూరి గోపాల కృష్ణ ఓటు వేశారు.

  • 07:22 AM

    Telangana Lok Sabha Election Polling Live Updates: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు క్యూకడుతున్నారు. 
     

Trending News