SIP Mutual Funds: ఈ ఫండ్‌లో నెలకు 10 వేలు పెడితే 48 లక్షలు చేతికి

SIP Mutual Funds: షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుగా మ్యూచ్యువల్ ఫండ్స్ మంచి మార్గమంటారు ఆర్ధిక నిపుణులు. ఎస్ఐపీ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి మంచి రిటర్న్స్ కూడా లభిస్తాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 7, 2024, 07:00 PM IST
SIP Mutual Funds: ఈ ఫండ్‌లో నెలకు 10 వేలు పెడితే 48 లక్షలు చేతికి

SIP Mutual Funds: సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది ప్రతి నెలా లేదా ప్రతి ఏటా లేదా ప్రతి వారం ఇలా మనం ఎంచుకున్న కాల వ్యవధిలో నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెట్టే డబ్బులు మ్యూచ్యువల్ ఫండ్స్‌లో చేరతాయి. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా పెట్టుబడి మీ సంపదను క్రమంగా పెంచుతుంది. నెలకు 10 వేల చొప్పున పెట్టుబడి పెడుతుంటే...భారీగా రిటర్న్స్ అందుకోవచ్చు. 

మోతీలాల్ ఓశ్వాల్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్ ఏప్రిల్ 14, 2014లో మొదలైంది. ఇందులో పెట్టుబడిపై 17.17 శాతం రిటర్న్స్ అందుతోంది. అంటే నెలకు 10 వేల చొప్పున పెట్టుబడి పెట్టి ఉంటే పదేళ్లలో మీ పెట్టుబడి 24.4 లక్షలయ్యేది. ఒకేసారి 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ కాస్తా 48,176 రూపాయలు అయ్యేది.  ఇందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మూడు రకాల స్టాక్స్ ఉంటాయి. వీటి ద్వారా 9,660 కోట్లు సేకరించనుంది. గత ఏడాది అత్యధికంగా 54.80 శాతం రిటర్న్స్ అందించిన స్టాక్ ఇది. గత మూడేళ్లలో 15.24 శాతం రిటర్న్స్, గత ఐదేళ్లలో సరాసరిన 13.14 శాతం అందించింది. 

ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత అంశాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఇన్వెస్ట్ చేయడం ప్రధాన ఉద్దేశ్యం. అయితే మోతీలాల్ ఓశ్వాల్ కంపెనీ ఈ విషయంలో ఎలాంటి గ్యారంటీ ఇవ్వదు. రిస్క్‌తో కూడుకున్న ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఇవి. కేటాయించిన తేదీ నుంచి 15 రోజుల్లోగా నిష్క్రమిస్తే 1 శాతం కట్ అవుతుంది. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే ఒకేసారి కాకుండా క్రమక్రమంగా ఇన్వెస్ట్ చేసేలా నెలకు నిర్ణీత మొత్తం పెట్టుబడి పెడుతుంటే మంచి ఫలితాలుంటాయి. 

రిటర్న్స్ ఎక్కువయ్యేకొద్దీ రిస్క్ శాతం కూడా పెరుగుతుంది. అందుకే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో సరైంది ఎంచుకుని ఇన్వెస్ట్ చేయాలి. 

Also read: Vivo Budget Phones: వివో నుంచి రెండు బడ్జెట్ ఫోన్లు, 50MP కెమేరా ఫోన్ కేవలం 9 వేలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News