YS Sharmila: రేవంత్‌ రెడ్డిని కలిసిన షర్మిల.. కొన్ని నిమిషాలు రహాస్య మంతనాలు?

YS Sharmila Revanth Reddy Meet: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి పునఃప్రవేశించిన తర్వాత తొలిసారి మళ్లీ తెలంగాణలో వైఎస్‌ షర్మిల అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కావడం గమనార్హం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 12, 2024, 10:37 PM IST
YS Sharmila: రేవంత్‌ రెడ్డిని కలిసిన షర్మిల.. కొన్ని నిమిషాలు రహాస్య మంతనాలు?

Sharmila Meets Revanth Reddy: తెలంగాణలో కృష్ణా జలాల అంశంపై తీవ్ర చర్చ నడుస్తున్న సమయంలో అనూహ్యంగా ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. కృష్ణా జలాలను కేసీఆర్‌ ఏపీకి తరలించారని.. నాడు సీఎం జగన్‌కు మాటిచ్చారని పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డితో షర్మిల సమావేశం కావడం విశేషం. తెలంగాణ రాజకీయాలను వదిలేసిన తర్వాత మరోసారి రేవంత్‌ను షర్మిల కలిశారు.

Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల రేవంత్‌ కావడం తొలిసారి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసానికి షర్మిల వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌ సతీమణితో కూడా షర్మిల సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాలకు పైగా రేవంత్‌, షర్మిల చర్చించుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలతోపాటు తెలంగాణలో పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పరిస్థితులను రేవంత్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై కూడా రేవంత్‌ ఆరా తీసినట్లు సమాచారం.

Also Read: TN Assembly: తమిళనాడులో 'జనగణమన' రచ్చ.. అసెంబ్లీని బహిష్కరించిన గవర్నర్‌

వీరి మధ్య కృష్ణా జలాల అంశం కూడా చర్చలోకి వచ్చాయని వార్తలు వస్తున్నాయి. తన కుమారుడి వివాహానికి షర్మిల మరోసారి ఆహ్వానించినట్లు కూడా షర్మిల వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం అనంతరం షర్మిల సోషల్‌ మీడియాలో ఓ పోస్టు చేశారు. తెలంగాణ సీఎంతో మర్యాదపూర్వకంగా సమావేశమైనట్లు షర్మిల తెలిపారు. 'ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చించడం జరిగింది' అని షర్మిల 'ఎక్స్‌'లో పోస్టు చేసింది.

ఏపీలో విస్తృత పర్యటనలు
కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకువస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించిన షర్మిల గోదావరి జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. ఈ సందర్భంగా అధికారంలో ఉన్న తన అన్న సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి భారీగా ఓట్లు రాబట్టేదుకు షర్మిల ప్రయత్నం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News