OnePlus under Rs 20000: రూ. 20 వేల లోపే చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన OnePlus.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

OnePlus 5g Smartphone Under Rs 20000: వన్‌ప్లస్ కంపెనీ చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను నేడు సాయంత్రం విడుదల చేయనుంది. ఆ స్మార్ట్‌ఫోన్‌ పేరు 'వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్'

Written by - P Sampath Kumar | Last Updated : Apr 11, 2023, 09:23 AM IST
  • వన్‌ప్లస్ నుంచి చౌకైన 5G స్మార్ట్‌ఫోన్
  • ధర, ఫీచర్ల వివరాలు ఇవే
  • వన్‌ప్లస్ ఇండియా ట్విట్టర్ పేజీలో లైవ్
OnePlus under Rs 20000: రూ. 20 వేల లోపే చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన OnePlus.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

OnePlus Nord CE 3 Lite 5G Smartphones Under Rs 20K: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ 'వన్‌ప్లస్' కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు నూతన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ కస్టమర్లను తెగ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే వన్‌ప్లస్ కంపెనీ చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను నేడు సాయంత్రం విడుదల చేయనుంది. ఆ స్మార్ట్‌ఫోన్‌ పేరు 'వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్' (OnePlus Nord CE 3 Lite). ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఫోన్ లంచ్ అవుతుంది. అభిమానులు ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

OnePlus Nord CE 3 Lite Watch Live Streaming:
వన్‌ప్లస్ 11ఆర్ (OnePlus 11R), వన్‌ప్లస్ పాడ్ (OnePlus Pad), బడ్స్ ప్రో 2 (Buds Pro 2), బడ్స్ ప్రో 2 ఆర్ (Buds Pro 2R) మరియు పీసీ (PC) యాక్సెసరీలతో పాటుగా కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 11 5జీ (OnePlus 11 5G)ని ప్రవేశపెట్టిన దాదాపు రెండు నెలల తర్వాత కొత్త లాంచ్ (వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్ స్మార్ట్‌ఫోన్‌) వస్తుంది. నోర్డ్ సీఈ 3 లైట్ చాలా చౌకైన ఫోన్‌గా ఉండనుంది. ఈ లాంచ్ ఈవెంట్‌ని మీరు OnePlus India అధికారిక YouTube ఛానెల్‌లో సాయంత్రం 7 గంటలకు చూడండి. వన్‌ప్లస్ ఇండియా ట్విట్టర్ పేజీలో కూడా లైవ్ ఈవెంట్ వస్తుంది.

OnePlus Nord CE 3 Lite Specifications:
వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు పూర్తి-HD+ రిజల్యూషన్‌తో 6.72-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Qualcomm యొక్క స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా శక్తిని పొందుతుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. వన్‌ప్లస్ ఛార్జింగ్ సుమారు 40 నిమిషాలలో అవుతుందని సమాచారం. 

OnePlus Nord CE 3 Lite Price:
వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్ స్మార్ట్‌ఫోన్‌ 108-మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వెనుక వైపు మరో రెండు కెమెరాలు ఉంటాయి. ఆ వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఫోన్ కొత్త లైమ్ రంగులో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర దాదాపు రూ. 20000 నుంచి రూ. 21,000 వరకు ఉంటుందని సమాచారం. 

Also Read: Best Smartphone Under 1000: రూ.11 వేల పోకో స్మార్ట్‌ఫోన్ రూ. 549కే.. కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్న జనాలు!

Aslo Read: Budget Smartphone Under 10000: 10 వేలకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్.. డిజైన్, లుకింగ్ అదుర్స్! 5000 బ్యాటరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News