Shani Jayanti 2024: ఏలినాటి శనితో బాధపడే వారికి జూన్ 6వ తేదీ ఎంతో ముఖ్యమైనది.. ఎందుకంటే?

Shani Jayanti 2024 In Telugu: వచ్చే నెలలోని 6వ తేదీన శని జయంతి వచ్చింది. ఈరోజు ఏలినాటి శని సమస్యలతో బాధపడుతున్న వారు శని దేవుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఈ రెమెడీస్ ని చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

 

Shani Jayanti 2024 In Telugu: ఈ సంవత్సరంలోని వచ్చిన జూన్ నెలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ నెలలో శనిజయంతి వచ్చింది. శని సడే సతీ అర్ధాష్టమ శని ఏలినాటి శనితో బాధపడుతున్న వారు ఈ సమయంలో శని దేవుడిని పూజించడం వల్ల అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా న్యాయదేవతగా చెప్పుకునే శని ఈ శని జయంతి రోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి.

1 /6

ప్రస్తుతం ఏలినాటి శని కాలం మీన రాశితో పాటు మకర, కుంభరాశి వారికి నడుస్తుంది. అయితే ఈ రాశి వారు శని జయంతి రోజున స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఆయన అనుగ్రహం లభించడమే కాకుండా సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

2 /6

ముఖ్యంగా శని గ్రహం అశుభ స్థానంలో ఉన్న కర్కాటక రాశి వృషభ రాశుల వారికి ఈ శని జయంతి అద్భుతమైన అవకాశాలను అందించబోతోంది. ఈరోజు వీరు కూడా కొన్ని రెమెడీస్ ను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

3 /6

ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని కారణంగా జీవితం మీద విరక్తి పుట్టిన వారు ఈ రోజు రావి చెట్టును పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.  

4 /6

ఈ రాశుల వారు శని జయంతి రోజున రావి చెట్టును పూజించడమే, కాకుండా ఆరోజు చెట్టు కింద దీపాన్ని వెలిగించి, శని దేవుడికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసి శని దేవుడికి ఎంతో ఇష్టమైన వస్తువులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

5 /6

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం జ్యేష్ట మాసంలో వచ్చే అమావాస్య రోజున శనిజయంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ సంవత్సరం జూన్ 6వ తేదీన వచ్చింది.  

6 /6

ఈరోజు శని దేవుడికి ఎంతో ఇష్టమైన నల్ల నువ్వులు, నల్ల వస్తువులను దానం చేయడం వల్ల ఏలినాటి శని నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.