Jr NTR - High Court: వివాదంలో జూనియర్ ఎన్టీఆర్.. హైకోర్టులో పిటిషన్..

Jr NTR - High Court: గత కొన్నేళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా తన సినిమాలే లోకంగా బతుకుతున్న ఎన్టీఆర్.. తాజాగా ఓ స్థలం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు తారక్.

Written by - TA Kiran Kumar | Last Updated : May 17, 2024, 02:54 PM IST
Jr NTR - High Court: వివాదంలో జూనియర్ ఎన్టీఆర్.. హైకోర్టులో పిటిషన్..

Jr NTR - High Court: జూనియర్ తన ఇంటి జాగాకు సంబంధింని వివాదం తలెత్తడంతో ఆయన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలోని 681 చదరుపు గజాల స్థలానికి సంబంధించి ఇష్యూ ఏర్పడింది. తాను ఈ స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2003లో కొనుక్కొన్నానని చెప్పారు. అందుకు సంబంధించిన అన్ని లీగల్ డాక్యుమెంట్స్ తన దగ్గర ఉన్నాయన్నారు. అంతేకాదు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాత అక్కడ ఇంటి నిర్మాణం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఆ భూమిని ఎన్టీఆర్‌కు అమ్మిన వ్యక్తులు 1996లో తన వద్ద కుదువ పెట్టి లోన్ తీసుకున్నారంటూ ఎస్‌బీఐ, ఓరియంటెల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్,  ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్పేసీ యాక్ట్ కింద డెట్ రికవరీ ట్రెబ్యునల్‌ను ఆశ్రయించాయి.

బ్యాంకు నోటీసులను సవాల్ చేస్తూ ముందుగా డీఆర్టీలో తారక్ తన లాయర్ల తరుపున పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న డీఆర్‌టీ ఈ స్థలంపై బ్యాంకులకే హక్కులులంటాయని తీర్పు ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ చేసిన కంప్లైంట్ ఆధారంగా తనకు భూమిని అమ్మిన గీతపై కేసు నమోదు అయింది. మరోవైపు డీఆర్‌టీ తీర్పుపై జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్ జే.ఎనివాసరావు ధర్మాసనం గురవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా డీఆర్‌టీ కాపీ తమ దగ్గర అందుబాటులో లేని కారణంగా కొంత టైమ్ కావాలని జూనియర్ తరుపున లాయర్ కోర్టును అభ్యర్ధించారు. నెక్ట్ విచారణను వెకేషన్ బెంచ్ ముందు పోస్ట్ చేయాలని రిక్వెస్ట్ చేసినా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. విచారణను జూన్6కు వాయిదా వేసారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన డాక్యుమెంట్లను జూన్ 3లోగా కోర్టులో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో పాటు వార్ 2 మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెబుతున్నాడు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ సినిమాతో పాటు మరో రెండు మూడు ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి.

Also Read: IPL 2024 RR vs PBKS: సామ్‌ కరాన్‌ పోరాటంతో పంజాబ్‌కు విజయం.. రాజస్థాన్‌ రాయల్స్‌ నాలుగో ఓటమి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News