Best Smartphones under Rs 15000: 15 వేల కంటే తక్కువ ధరలో టాప్ స్మార్ట్‌ఫోన్‌లు.. ఫీచర్లు తెలిస్తే ఇప్పుడే కొనేసుకుంటారు!

2023 Best Smartphones under Rs 15000 in India.  4G ఫోన్ కొనాలా లేదా 5G సపోర్ట్ ఉన్న సాధారణ ఫోన్ కొనాలా అని ఆలోచనలో ఉంటారు. అయితే 2023లో 15 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ఇప్పుడు చూద్దాం.   

Written by - P Sampath Kumar | Last Updated : May 5, 2023, 04:25 PM IST
Best Smartphones under Rs 15000: 15 వేల కంటే తక్కువ ధరలో టాప్ స్మార్ట్‌ఫోన్‌లు.. ఫీచర్లు తెలిస్తే ఇప్పుడే కొనేసుకుంటారు!

2023 Best Smartphones under Rs 15000 in India: భారతదేశంలో రూ. 15,000లోపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను కనుగొనడం అంత సులభం కాదు. ప్రస్తుత కాలంలో 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఈ బడ్జెట్‌లో వాటిని కనుగొనడం కొంచెం కష్టం. ఏ ఫీచర్ విషయంలోనూ రాజీ పడకుండా రూ.15,000 కంటే తక్కువ ధరకే 5జీ ఫోన్ దొరకడం కాస్త కష్టం. కాబట్టి మీకు ఏ ఫోన్ కొనాలో అనే సందిగ్ధం ఉంటుంది. మెరుగైన స్పెసిఫికేషన్‌లతో కూడిన 4G ఫోన్ కొనాలా లేదా 5G సపోర్ట్ ఉన్న సాధారణ ఫోన్ కొనాలా అని ఆలోచనలో ఉంటారు. అయితే 2023లో 15 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ఇప్పుడు చూద్దాం. 

Realme 10 4G:
రియల్‌మీ 10 4G 6.4-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంది. ఈ ఫోన్‌లో Mediatek MT8781 Helio G99 (6nm) ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ఇవ్వబడింది. ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరా మరియు f/2.4 ఎపర్చర్‌తో 2 మెగా పిక్సెల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999.

Samsung Galaxy F14 5G:
శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్14 5G 1080 x 2408 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా కోర్ Exynos 1330 (5nm) ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 6GB RAM మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్‌లు, 2 మెగాపిక్సెల్‌లు కెమెరాలు ఉంటాయి. ఇందులో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.15,990 ధరకు అందుబాటులో ఉంది.

Realme C55:
రియల్‌మీ సీ55 Mediatek Helio G88 ప్రాసెసర్‌తో పనిచేసే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. ఇది 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. రియల్‌మీ సీ55 యొక్క 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది.

Also Read: Toyota Hyryder Price Hike 2023: 60 వేలు పెరిగిన టయోటా హైరైడర్ ధర.. కొత్త ధరల జాబితా ఇదే!

Also Read: 2023 Budget SUVs: 10 లక్షల లోపు 8 ఎస్‌యూవీలు.. పంచ్, నెక్సాన్, బ్రెజాతో సహా కార్ల జాబితా ఇదే!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News