Uric Acid Control: యూరిక్ యాసిడ్‌ను ఈ 5 కూరగాయలు క్షణాల్లో బయటకు తరిమేస్తాయి..

Uric Acid Control Vegetable: యూరిక్ యాసిడ్‌ సమస్య ఎక్కువవుతే కీళ్లనొప్పులు కాళ్లలో చేతుత్లో నొప్పులు వస్తాయి. ఇది మన రక్తంలో ఉండే వ్యర్థం. యూరిక్ యాసిడ్ మన శరీరంలో ఎక్కువైనప్పుడు కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. 
 

Uric Acid Control Vegetable: మనం ఇంట్లో ఉండే కూరగాయలతో కూడా యూరిక్ యాసిడ్‌ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇది వరకు కొన్ని రకాల పండ్లతో యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవచ్చు. అయితే, ఎలాంటి కూరగయాలు తీసుకుంటే యూరిక్ యాసిడ్‌ సమస్యను తగ్గిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

1 /5

టమాట.. టమాటలో లైకోపీన్ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న యూరిక్ యాసిడ్‌ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ కూరగాయ మన అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. దీంతో వివిధ రకాల కూరలు, చట్నీలు తయార చేసుకుంటాం. టమాటలో విటమిన్ సీ ఉంటుంది. ఇది మనకు ఇమ్యనిటీని పెంచడంతోపాటు శరీరంలో అదనంగా పేరుకున్న యూరిక్ యాసిడ్‌ స్థాయిలను కూడా సమర్థవంతంగా తగ్గించేస్తాయి.

2 /5

పర్వాల్.. పర్వాల్ కూడా అన్నీ సీజన్లలో దొరికే కూరగాయ. దీంతో కూరలు వండుకుంటాం. పర్వాల్ కూడా మన శరీరంలో ఉన్న అదనపు వ్యర్థాలను బయటకు పంపించేస్తుంది. యూరిక్‌ స్థాయిలు రాకుండా, గౌట్‌, కీళ్ల నొప్పులు రాకుండా నివారిస్తుంది. మీ డైట్లో పర్వాల్ కూడా చేర్చుకోండి.

3 /5

బూడిద గుమ్మడికాయ.. అధిక యూరిక్ యాసిడ్‌ సమస్య ఉంటే ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల వస్తుంది. బూడిద గుమ్మడికాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మీరు తరచుగా ఈ గుమ్మడికాయను తింటే మీకు యూరిక్ యాసిడ్ సమస్యే ఉండదు. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.

4 /5

పుట్టగొడుగులు.. అధిక యూరిక్ యాసిడ్‌ సమస్య ఉన్నవారు తినాల్సిన మరో ఆరోగ్యకరమైన కూరగాయ పుట్టగొడుగులు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. పుట్ట గొడుగులను కూడా మీ డైట్లో చేర్చుకోండి. ఇది కూడా యూరిక్ యాసిడ్‌ సమస్యను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.  

5 /5

కీరదోసకాయ.. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఎండకాలం రాగానే మార్కెట్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, కీరదోసకాయలో అన్నీ సీజన్లలో కూడా అందుబాటులో ఉంటాయి. వీటిని మీ కూడా మీ డైట్లో చేర్చుకుంటే మీకు యూరిక్ యాసిడ్‌ సమస్య ఉండదు. వీటిని ఎక్కువ శాతం జ్యూస్‌, సలాడ్‌ రూపంలో తీసుకుంటారు. నేరుగా కూడా తినేయవచ్చు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )