Cheapest courtries to travel from Bharat: అతి తక్కువ ఖర్చుతో సామాన్యులు కూడా ఈ దేశాలను ఈజీగా చుట్టి రావొచ్చు..

Top cheapest countries to travel from Bharat: చాలా మందికి ఇతర దేశాలకు విహార యాత్రలకు వెళ్లాలని ఉంటుంది. కానీ బడ్జెట్ సహకరించదు. కానీ భారత్ పక్కన ఉన్న ఈ దేశాలను అతి తక్కువ ఖర్చుతో సామాన్యులు ఈజీగా చుట్టి రావొచ్చు. అవేంటో చూడండి..

 

1 /8

శ్రీలంక (Srilanka) భారత దేశానికి అతి సమీపంలో దక్షిణాన ఉన్న మరో దేశం శ్రీలంక. ఇక్కడ రామాయణ ఇతిహాసాలకు సంబంధించి ఎన్నో ప్రదేశాలను సందర్శించవచ్చు. చారిత్మక నగరం కాండీ నుండ మిరిస్సాలోని సహజమైన బీచ్‌ల వరకు..అన్నింటిని సందర్శించండి. అంతేకాదు UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో పాటు వన్య ప్రాణులకు సంబంధించిన సఫారీలను ఎన్నిటినో అతి తక్కువ ఖర్చతో సందర్శించవచ్చు.

2 /8

  నేపాల్ (Nepal) నేపాల్ మన పొరుగు దేశం. ఇక్కడికి వెళ్లడానికి ఎలాంటి వీసా, పాస్‌పోర్ట్ అవసరం లేదు. ఇక్కడ ఎన్నో అద్భుత ఆలయాలున్నాయి. పశుపతి నాథ్ ఆలయం, సీతామర్హి వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించవచ్చు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరాలనుకునే వారు నేపాల్ నుంచే బయలుదేరుతారు. మరోవైపు హిమాలయ ఒడిలో ఉన్న ప్రకృతి దృష్యాలను ఆస్వాదించుకునేవారు ఈ దేశాన్ని అతి తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు.

3 /8

భారత దేశం నుంచి అతి తక్కువ ఖర్చుతో వెళ్లే దేశాల్లో థాయ్‌లాండ్ ఒకటి. డైనమిక మార్కెట్లు.. మరియు బీచ్‌లతో ఈ దేశం పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఫుకెట్, కో స్యామ్యూయ్ ద్వీపాలను సందర్శించవచ్చు.  

4 /8

వియత్నాం (Vietnam) వియత్నాంలో ఎంతో ఉల్లాసభరితమైన ప్రకృతి దృష్యాలకు నిలయం. అంతేకాదు అక్కడి చారిత్రక వంటకాలకు ప్రసిద్ది. ముఖ్యంగా హనోయ్ వీధుల్లో షికారు చేయవచ్చు. హలోంగ్ బేలోని సుందరమైన ప్రదేశాల మధ్య ప్రయాణించవచ్చు.

5 /8

కంబోడియా (Combodia) మన దేశం నుంచి అతి చౌక ధరలతో ప్రయాణించే దేశాల్లో కంబోడియా ఒకటి. కొంత మంది ఇది ఒకప్పటి కాంభోజ దేశంగా పిలిచేవారట. ఇక్కడ ప్రపంచంలోని అత్యంత విశాలమైన అంకర్ వాట్ దేవాయలంను సందర్శించవచ్చు. మరియు తీర ప్రాంతాలు.. ఎన్నో పురాతన ఆలయాలను ఇక్కడ సందర్శించవచ్చు.

6 /8

ఇండోనేషియా (Indonesia) అద్భుతమైన బీచ్‌లు, దట్టమైన అరణ్యాలతో పర్యాటకలను ఆకర్షిస్తోన్న దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ఇక్కడ జకార్తాతో పాటు బాలి వంటి ప్రదేశాలను అతి తక్కువ ఖర్చుతో విజిట్ చేయవచ్చు. అంతేకాదు పురాతన ఆలయాలతో పాటు అగ్ని పర్వతాలను సందర్శించవచ్చు.

7 /8

మలేషియా (Malasia) మన దేశం నుంచి అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించే దేశాల్లో మలేషియా ఒకటి. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి రమణీయ దృష్యాలతో పాటు నగరాలతో అలరారుతోంది. కౌలాలంపూర్, లంగ్‌కావి, పెనాంగ్‌లోని అందమైన బీచ్‌ల వరకు మలేషియాలో ఎన్నో అద్బుతమైన సుందర ప్రదేశాలను సందర్శించవచ్చు.

8 /8

ఫిలిప్పైన్స్ ..Philippines ఫిలిఫైన్స్ లో అద్భుతమైన బీచ్‌లు, రిసార్టులకు పెట్టింది పేరు. ఫిలిప్పీన్స్ బడ్జెట్ ప్రయాణికులకు స్వర్గధామం అని చెప్పాలి. రాజధాని మనీలాలో వీధుల్లో నుంచి పలావాన్‌తో పాటు పగడపు దిబ్బలను సందర్శించవచ్చు. తెల్లటి ఇసుక బీచ్‌లలో హాయిగా సేద తీరవచ్చు.