Supreme Court: 'రాహుల్ గాంధీ' పేరుందని ఎన్నికల్లో పోటీ చేయోద్దంటే ఎలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Supreme Court: సాధారణంగా ఎన్నికల్లో ఒక పెద్ద పార్టీ నుంచి పోటీ చేస్తోన్న వ్యక్తి పేరుతో పలువురు ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఓటర్లను కన్ఫ్యూజన్ చేసేందుకు ఈ ఎత్తుగడను అనుసరిస్తూ ఉంటారు. ప్రత్యర్ధి పార్టీ వ్యక్తులే ఇలా ఆయా అభ్యర్ధులను ఎన్నికల బరిలో దింపుతుంటారు. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 4, 2024, 06:51 AM IST
 Supreme Court: 'రాహుల్ గాంధీ' పేరుందని  ఎన్నికల్లో  పోటీ చేయోద్దంటే ఎలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Supreme Court: ఎలక్షన్స్‌లో ఒక పేరుతో ఉన్న వ్యక్తులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ప్రముఖ రాజకీయ నేతల పేర్లతోన్న వ్యక్తులు ఇండిపెండెంట్‌గా పోటీ చేయకుండా తాము ఆపలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక నియోజకవర్గంలో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులను పోటీ చేయకండా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సాబు స్టీఫేన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. చాలా ఏళ్లుగా కీలక స్థానాల్లో పోటీ చేస్తోన్న అభ్యర్ధుల విజయాన్ని అడ్డుకోవడానికి ప్రత్యర్ధి పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఈ ఎత్తుగడను అనుసరిస్తారు. ఇది చాలా తీవ్రమైన అంశం. సుప్రీంకోర్టు ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని అంతేకాదు ఓ పరిష్కారం చూపించాలని తన పిటిషన్‌లో కోరారు.

ఇక అపెక్స్ కోర్టు ఈ అంశంపై విచారించేందుకు తిరస్కరించింది. ఈ కేసు ఎలాంటిదో మీకు అర్ధమవుతుందా అంటూ సదరు పిటిషనర్‌కు తలంటు పోసింది. మన పేర్లను తల్లదండ్రులు పెట్టినపుడు ఎన్నికల్లో పోటీ చేసేందకు అది ఎలా అడ్డుగా నిలుస్తుందనే విషయాన్ని ఈ సందర్బంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది.

ఒకవేళ ఎవరైనా రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ వంటి పేర్లు ఉంటే వాళ్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపడం సాధ్యమేనా అని
సదురు పిటిషనర్‌ను ప్రశ్నించింది. అది వాళ్ల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్టు కాదా అని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. ఆ తర్వాత కోర్టు పర్మిషన్‌తో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకున్నాడు.

ఇదీ చదవండి:  హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News