Mrunal Thakur: మృణాల్ బ్లాక్ అండ్ వైట్ అందాలు.. ఫిదా చేస్తున్న నటి!

Mrunal Thakur Instagram Pics: సీతారామం సినిమాతో మన అందరి మనసు దోచిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా అందరిని ఆకట్టుకుంటుంది.
 

1 /5

హిందీలో చిన్న సీరియల్స్ తో తన కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత.. అక్కడే కొన్ని సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అయితే ఈ హీరోయిన్ కి సూపర్ హిట్ అందించింది మాత్రం సౌత్ ఇండస్ట్రీ.

2 /5

తెలుగులో దుల్కర్ సల్మాన్ తో,  హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా చేసింది మృణాల్. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఆమెను స్టార్ హీరోయిన్ గా మార్చింది.

3 /5

ఇక ఆ తర్వాత వెంటనే నాని.. హాయ్ నాన్న సినిమాలో నటించి మరో సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో తెలుగులో మృణాల్ కి ఇంకా తిరుగులేదు అని అందరు అనుకున్నారు. 

4 /5

అయితే ఈ మధ్య విజయ్ దేవరకొండ.. మృణాల్ చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. కానీ మృణాల్ క్రేజ్ అయితే తగ్గలేదు.

5 /5

ప్రస్తుతం తెలుగు హిందీ సినిమాల్లో.. నటిస్తున్న ఈ హీరోయిన్ తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంది. ముఖ్యంగా ఈ మధ్య షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.