US-Presidential Elections: ర్యాలీలకు సిద్ధం అంటున్న ట్రంప్...వర్చువల్ అంటున్న అధికారులు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) తను ర్యాలీలకు సిద్ధం అని తెలిపాడు. 

Last Updated : Oct 9, 2020, 03:07 PM IST
    • అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తను ర్యాలీలకు సిద్ధం అని తెలిపాడు.
    • కోవిడ్-19 నిర్ధారణ అయిన వారం తరువాత ఆరోగ్యం మెరుగ్గా ఉంది అని, ట్రంప్ చికిత్స పూర్తి చేసుకున్నాడు అని వైద్యులు తెలిపారు.
    • కరోనావైరస్ వల్ల ఇప్పటి వరకు మొత్తం 210,000 అమెరికా పౌరులు మరణించారు.
US-Presidential Elections: ర్యాలీలకు సిద్ధం అంటున్న ట్రంప్...వర్చువల్ అంటున్న అధికారులు

మెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) తను ర్యాలీలకు సిద్ధం అని తెలిపాడు. కోవిడ్-19 నిర్ధారణ అయిన వారం తరువాత ఆరోగ్యం మెరుగ్గా ఉంది అని, ట్రంప్ చికిత్స పూర్తి చేసుకున్నాడు అని వైద్యులు తెలిపారు. కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ఇప్పటి వరకు మొత్తం 210,000 అమెరికా పౌరులు మరణించారు.

ALSO READ| Salon In Corona Time: హెయిర్ సెలూన్ లేదా పార్లర్ కు వెళ్తున్నారా.. ఈ చిట్కాలు పాటించండి

కోవిడ్-19 ( Covid-19 ) చికిత్స పూర్తయినా కానీ ట్రంప్ ఇప్పటి వరకు బయట కనిపించలేదు. కేవలం శ్వేతసౌధం ( White House ) నుంచి కొన్ని వీడియోలు తీసి షేర్ చేశాడు. నేవీ కమాండర్, వైద్యుడు అయిన శాన్ కోన్లీ ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నాడు అని..ప్రజల్లోకి వెళ్లగలడు అని తెలిపాడు. అంతకు ముందు ట్రంప్ తన వీడియోల్లో, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎన్నికలకు సంబంధించిన కామెంట్స్ చేయడం కనిపించింది. 

ర్యాలీలకు సిద్ధం
ఇక ఎన్నికలకు ముందు జరిగే ప్రెసిడెన్షియల్ డిబేట్స్ కు తను సిద్ధం అని ప్రకటించిన ట్రంప్ వర్చువల్ డిబేట్స్ మాత్రం కుదరదు అన్నాడు. తను ఆరోగ్యంగా ఉన్నప్పుడు అలా కంప్యూటర్ ముందు కూర్చుని మాట్లాడటం ఎందుకు...ఈ రోజు రాత్రి ర్యాలీ చేపట్టడానికి కూడా సిద్ధం  అని.. దాని వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నానని తెలిపాడు డోనాల్డ్ ట్రంప్.

మరో 10 రోజుల పాటు ఎలాంటి లక్షణాలు లేకుండా, ఆరోగ్యవంతంగా ఉంటే ట్రంప్ శరీరంలో వైరస్ అంతం అయినట్టు భావించవచ్చు అని సీనియర్ అధికారులు తెలిపారు. అంటే మరో 10 రోజుల పాటు ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం బయటికి వెళ్లరని పరోక్షంగా అధికారులు చెబుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు.  

ALSO READ| Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?

నిజానికి ఇది ఒక క్రాస్ రోడ్ లాంటి పరిస్థితి. శ్వేతసౌధం అధికారులు ట్రంప్ బయటికి మరో 10 రోజులు వెళ్లే అవకాశం లేదు అన్నట్టుగా వర్చువల్ మీటింగ్స్ కోసం ఏర్పాట్లు చేస్తే మంచిది అని భావిస్తున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం వర్చువల్ మీటింగ్స్ వద్దు..కావాలంటే నేను ర్యాలీకి రెడీ అంటున్నాడు. ఇలాంటి సమయంలో అమెరికా ఎన్నికల ప్రచారం ఎలా ముందుకెళ్తుందో చూడాలి మరి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News