Donald Trump: రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్‌ని తొలగించిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డోనాల్ట్ ట్రంప్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. దేశ రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ ని తొలగించి..ఆ స్థానంలో  తాత్కాలికంగా క్రిస్టోఫర్‌ను నియమించారు. 

Last Updated : Nov 10, 2020, 05:21 PM IST
Donald Trump: రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్‌ని తొలగించిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( America Elections ) ఓటమి పాలైన డోనాల్ట్ ట్రంప్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. దేశ రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్‌ని తొలగించి..ఆ స్థానంలో  తాత్కాలికంగా క్రిస్టోఫర్‌ను నియమించారు. 

అమెరికాలో ఓ విచిత్రమైన పరిస్థితి ఉంటుందెప్పుడూ. పదవీకాలం ఇంకా ఉండగానే తదుపరి అధ్యక్షుడి నిర్ణయం జరుగుతుంది. కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయడానికి పది వారాల సమయం సాధారణంగా ఉండనే ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈ పది వారాల్లో కీలకమైన నిర్ణయాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ఇప్పుడీ పదివారాల ఎన్నికల్ని తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారు.

ఇందులో భాగంగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రక్షణశాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ ( Defence secretary Mark Esper )ని తొలగిస్తున్నట్లు తెలిపారు. దేశానికి అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ ట్వీట్‌ కూడా చేశారు. ఇక ఎస్పర్‌ స్థానంలో క్రిస్టోఫర్ సీ మిల్లర్ ( Christofer c miller ) ‌ను  తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ప్రస్తుతం క్రిస్టోఫర్ జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ‌‌ఇక ట్రంప్‌ నాలుగేళ్ల అధ్యక్ష కాలంలో ఎస్పర్‌ నాలుగవ పెంటగాన్‌ చీఫ్‌గా పని చేశారు‌. 16 నెలల పాటు బాధ్యతల్ని నిర్వహించిన తరువాత ఎస్పర్‌ని ఉద్యోగంలో నుంచి తొలగించారు. Also read: Hyperloop : హైపర్ లూప్ పాసెంజర్ ట్రైన్ తొలి ప్రయోగం సక్సెస్, ముంబై-పూణేపై దృష్టి

ఎస్పర్‌పై ఇటీవల ఓ వ్యవహారంలో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశఆరు. పౌర అశాంతిని నియంత్రించేందుకు ఫెడరల్ దళాలను ( Federal forces ) మోహరించాలని ఎస్పర్ ఒత్తిడి చేయడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలను వేగంగా ఉపసంహరించుకోవాలన్న ట్రంప్ ఉత్తర్వులను.. ఎస్పర్‌ నెమ్మదిగా అమలు చేశారు. 

ఇక రానున్న పది వారాల్లో ట్రంప్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారోననే భయం నెలకొంది.  ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో..ఎవరిని ఇంటికి పంపిస్తారో అనే ఆందోళన ఏర్పడింది. ఇప్పటికే ఎన్నికల తీర్పును అంగీకరించని ట్రంప్...కోర్టులో సవాలు చేశారు. ప్రస్తుతం ఎస్పర్‌ స్థానంలో నియమితులైన క్రిస్టోఫర్‌ మిల్లర్‌ దాదాపు 31 ఏళ్ల పాటు సైన్యంలో పని చేశారు. 2001 అఫ్ఘనిస్తాన్‌లో, 2003లో ఇరాక్‌లో మోహరించిన ప్రత్యేక బలగాల్లో పని చేశారు.  Also read: Pfizer versus Trump: వ్యాక్సిన్ ప్రకటనపై డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం

Trending News