Dhana Rajayogam 2023: సెప్టెంబర్ 17 వరకూ ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్, అంతా ధనమే

Dhana Rajayogam 2023: సూర్యుడి సింహ రాశి ప్రవేశం చాలా పరిణామాలకు కారణమౌతుంది. ఓ వైపు బుధాదిత్య రాజయోగం మరోవైపు ధన రాజయోగం ఏర్పడుతున్నాయి. ధన రాజయోగం కారణంగా ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభమైనట్టేనంటున్నారు జ్యోతిష్య పండితులు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 22, 2023, 09:27 AM IST
Dhana Rajayogam 2023: సెప్టెంబర్ 17 వరకూ ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్, అంతా ధనమే

Dhana Rajayogam 2023: హిందూమత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఒక్కొక్క రాశి మారుతుంటుంది. అదే విధంగా సూర్యుడు నెలకోసారి రాశి పరివర్తనం చెందుతుంటాడు. సరిగ్గగా ఏడాది తరువాత సూర్యుడు తన రాశి సింహంలో ఆగస్టు 17న ప్రవేశించాడు. సూర్యుడి సింహ రాశి ప్రవేశంతో ఏర్పడిన ధన రాజయోగం కొన్ని రాశులలకు అత్యంత శుభప్రదంగా మారనుంది. 

జ్యోతిష్యశాస్త్రంలో ధన రాజయోగానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ధన రాజయోగం అనేది సంబంధిత రాశి జాతకులకు సమాజంలో గౌరవ మర్యాదలు అందిస్తుంది. వాస్తవానికి సూర్యుడి సింహ రాశి ప్రవేశం కారణంగా ఏర్పడిన ధన రాజయోగం అన్ని రాశులపై ప్రబావం చూపించినా..మూడు రాశులకు అంతులేని లాభాలు అందిస్తుంది. ఈ మూడు రాశులకు ఆకశ్మిక ధనలాభం ఇవ్వడమే కాకుండా వృత్తి, వ్యాపారంలో వృద్ధి ఇస్తుంది. మేషం, వృషభం, సింహ రాశులవారికి ఆగస్టు 17 నుంచి మంచి రోజులు ప్రారంభమయ్యాయంటున్నారు. ఫలితంగా కోరుకున్నవి జరుగుతూ సుఖంగా ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం అప్రమత్తత అవసరమంటున్నారు.

సూర్యుడి సింహ రాశి ప్రవేశంతో ఏర్పడే ధన రాజయోగం ముఖ్యంగా వృషభ రాశి జాతకులపై ప్రత్యేకంగా ఉండనుంది. ఈ రాశులకు ధన రాజయోగం ఓ వరం లాంటిదని చెప్పవచ్చు. కీలకమైన లావాదేవీ నుంచి విముక్తి పొందడం వల్ల మంచి రిలీఫ్ కలుగుతుంది. మీ జీవితంలో సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. మీకున్న ఆస్థుల కారణంగా లాభం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏదైనా అనారోగ్యం బారిన పడి ఉంటే దాన్నించి ఉపశమనం లభిస్తుంది. కొత్త ఉద్యోగాలు రావచ్చు.

సింహ రాశిపై ధన రాజయోగం ప్రభావం ఊహించని విదంగా ఉంటుంది. ఎందుకంటే ధన రాజయోగం ఏర్పడేది ఈ రాశిలోనే. అందుకే సూర్యుడి సింహ రాశి జాతకులకు అమితమైన లాభాలు అందించనున్నాడు. ఈ రాశి జాతకుల ఆరోగ్యంపై మెరుగుపడుతుంది. రాజకీయాల్లో ఉండేవారికి మంచి సమయం. సంబంధాలు మెరుగుపడి లాభాలు కలుగుతాయి. కెరీర్‌లో సాఫల్యం లభిస్తుంది. 

సూర్యుడు సింహ రాశిలో ప్రవేశించడం వల్ల ఏర్పడే ధన రాజయోగం కారణంగా మేష రాశి జాతకులకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది.  విద్యార్ధులకు, పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్ధులకు చాలా అనువైన సమయం. కష్టపడితే మంచి ఫలితాలుంటాయి. ఆదాయం పెరిగే మార్గాలుంటాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరగవచ్చు. ఉద్యోగ, వ్యాపారస్థులకు మంచి సమయం. అంటే వ్యాపారులు లాభాలు ఆర్జిస్తే..ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు దక్కుతాయి. 

Also read: Sun Transit 2023: ఈ మూడు రాశులకు సెప్టెంబర్ 17 వరకూ అన్నీ లాభాలే, పెట్టుబడికి మంచి సమయం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News