Eroju Rasi Phalalu: బుధవారం రాశి ఫలాలు.. ఈ రాశులవారికి లాభాలతో నష్టాలు!

Today Rasi Phalalu Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 6 కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2024, 12:12 PM IST
Eroju Rasi Phalalu: బుధవారం రాశి ఫలాలు.. ఈ రాశులవారికి లాభాలతో నష్టాలు!

Today Rasi Phalalu Telugu 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..మార్చి 6న చంద్రుడు ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా అనుకులంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందితే మరికొన్ని రాశులవారు తీవ్ర దుష్ప్రభావాలకు గురవుతారు. అంతేకాకుండా చంద్రుడు ధనస్సు రాశిలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు జరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

రాశి ఫలాలు:
మేష రాశి:

మేష రాశి వారికి ఈ బుధవారం చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజు మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో కుటుంబంతో సమయాన్ని గడుపుతారు.  అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. 

వృషభ రాశి:
ఈరోజు వృషభ రాశి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఎంతో ఓపితో ఉండడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు బారిన పడే ఛాన్స్‌ కూడా ఉంది. 

మిథున రాశి:
మిథున రాశి వారికి బుధవారం కలసి వస్తుంది. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కాబట్టి ఈ రోజు మంచి ఎదైన పనిని ప్రారంభించడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అలాగే స్నేహితుల నుంచి కూడా లాభాలు పొందుతారు.

కర్కాటక రాశి:
ఈరోజు కర్కాటక రాశి వారు కొంచెం ఒత్తిడికి గురవుతారు. అలాగే మీ పనినై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది. అలాగే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు కూడా రావచ్చని నిపుణులు తెలుపుతున్నారు. 

సింహ రాశి:
సింహ రాశి వారికి బుధవారం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు వీరు శక్తివంతులవుతారు. అంతేకాకుండా లక్ష్యాలను చేరుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో కూడా చాలా సంతోషంగా ఉంటారు.

కన్య రాశి:
ఈ బుధ వారం కన్య రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా స్నేహితులు, కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడతారు. అలాగే ఆర్థికంగా కూడా చాలా రకాల లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

తుల రాశి:
ఈ రోజు తుల రాశివారికి ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. 

వృశ్చిక రాశి:
బుధ వారం వృశ్చిక రాశి వారు ఎంతో సృజనాత్మంగా ఉంటుంది. కొత్త ఆలోచలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తారు. దీంతో పాటు కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

ధనస్సు రాశి:
ఈరోజు ధనస్సు రాశి వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు. అంతేకాకుండా ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

మకర రాశి:
మకర రాశి వారికి బుధ వారం కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

కుంభ రాశి:
కుంభ రాశివారు ఈ రోజు చాలా శక్తివంతంగా ఉంటారు. అంతేకాకుండా లక్ష్యాలను చేరుకోవడానికి విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉంటారు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. 

మీన రాశి:
మీన రాశివారు ఈ బుధవారం శుభవార్తలు వింటారు. అంతేకాకుండా స్నేహితుల నుంచి కూడా ఊహించని లాభాలు పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ఊహించని ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. 

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News