Jojoba Oil for hair: జోజోబ ఆయిల్ మీ తలకు మసాజ్ చేస్తే 5 మిరాకిల్స్ జరుగుతాయి..

Jojoba Oil for hair benefits: సాధారణంగా జుట్టుకు నూనె పెట్టుకోవాలంటే కొబ్బరి నూనె వాడతం అయితే, కేవలం ఇదే కాదు. మీ జుట్టుకు మంచి పునరుజ్జీవనం, పోషకం అందుతుందని మీకు తెలుసా ?

Written by - Renuka Godugu | Last Updated : May 19, 2024, 09:39 AM IST
Jojoba Oil for hair: జోజోబ ఆయిల్ మీ తలకు మసాజ్ చేస్తే 5 మిరాకిల్స్ జరుగుతాయి..

Jojoba Oil for hair benefits: సాధారణంగా జుట్టుకు నూనె పెట్టుకోవాలంటే కొబ్బరి నూనె వాడతం అయితే, కేవలం ఇదే కాదు. మీ జుట్టుకు మంచి పునరుజ్జీవనం, పోషకం అందుతుందని మీకు తెలుసా ? జోజోబ ఆయిల్‌ తో మీ హెడ్ మసాజ్ చేయడం వల్ల మంచి పోషకాలు అందిస్తుంది ఇది జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు కుదుళ్ల సమస్యలు కూడా రాకుండా నివారిస్తుంది. అంతేకాదు మీ జుట్టుకు గ్లాస్ లుక్ లో మృదువుగా అందంగా కనిపిస్తుంది. హెయిర్ బ్రేకేజ్, స్ప్లిట్ ఎండ్ సమస్య కూడా నివారిస్తుంది. అయితే, రెగ్యులర్‌ గా మన జుట్టుకు జోజోబ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల మన జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

పొడిబారిన జుట్టు..
జోజోబ ఆయిల్ జుట్టుకు రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి, ఇది జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. ఇంకా సోరియాసిస్ జుట్టుపై రాకుండా పొడిబారటాన్ని తగ్గిస్తుంది. కుదుళ్ల నుంచి జుట్టుకు ఆరోగ్యవంతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. జుట్టు పొడిబారటం వల్ల డ్యాండ్రఫ్‌ సమస్య కూడా వస్తుంది.

నేచురల్ మాయిశ్చరైజర్..
అంతేకాదు జోజోబ ఆయిల్ నేచురల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. జుట్టు చర్మంపై సెబం ఉత్పత్తిని తగ్గించి మన జుట్టు కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా ఉంచి మాయిశ్చర్ నిలుపుతుంది. దీంతో డ్యాండ్రఫ్‌ సమస్య కూడా రాదు. దీంతో హెయిర్‌ ఫాల్‌ సమస్య ఉండదు.

ఇదీ చదవండి: మేకపాలలో ఉన్న లాభాలు తెలిస్తే.. ఆవు, గేదె పాలు తాగడం వెంటనే మానేస్తారు..

పోషకాలు పుష్కలం..
జోజోబ ఆయిలో విటమిన్ ఏ, విటమిన్ ఇ, ఎఫ్ ఆల్కహాల్‌, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో ఉండే స్క్వేలీన్,  విటమిన్ ఏ ,ఇ తో కలిపి ఫ్రీ రాడికల్ డామేజ్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. జోజోబ ఆయిల్‌తో మీ జుట్టుకు ఆరోగ్యం. జోజోబ ఆయిల్‌ ఉండే సౌందర్య ఉత్పత్తులు కూడా మార్కెట్‌లో విస్తృతంగా దొరుకుతున్నాయి.

జుట్టు నిర్వహణ..
జోజోబ ఆయిల్‌ మీ హెయిర్ కేర్ రొటీన్ లో యాడ్ చేసుకుంటే స్ప్లిట్ అండ్ సమస్య ఉండదు. జుట్టు కుదళ్ల నుంచి బలపడి దురదల వంటివి ఉండవు. అంతేకాదు జోజోబ ఆయిల్ మీ జుట్టుపై PH లెవెల్ ని నిర్వహిస్తుంది. ఇది కాకుండా చర్మానికి కూడా ఎంతో ఆరోగ్య కరం.

ఇదీ చదవండి:  ఈ పండ్లు తింటే నిద్ర హాయిగా పడుతుంది.. ఉదయం వరకు మేల్కోరట..

యాంటీ మైక్రోబియల్ గుణాలు..
జోజోబ ఆయిల్‌ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబ్రియల్ గుణాలు జుట్టును ఆరోగ్యంగా పెంచేలా ప్రోత్సహిస్తాయి. అంతేకాదు జోజోబ ఆయిల్‌లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కూడా ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News