కలలో కూడా ఊహించనంత డబ్బు.. కూలీ ఖాతాలో రూ.2700 కోట్లు.. కానీ చివరకు బిగ్ ట్విస్ట్...

UP Labour Becomes Billionaire: యూపీకి చెందిన ఓ కూలీకి అదృష్టం ఇలా వచ్చి అలా మాయమైపోయింది. కలలో కూడా ఊహించనంత డబ్బు అతని ఖాతాలో పడింది. 

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 3, 2022, 12:39 PM IST
  • యూపీలో ఓ కూలీ ఖాతాలో రూ.2700 కోట్లు
  • కలలో కూడా ఊహించినంత డబ్బు
  • కానీ అనుకోని ట్విస్ట్ ఇచ్చిన బ్యాంక్ సిబ్బంది
కలలో కూడా ఊహించనంత డబ్బు.. కూలీ ఖాతాలో రూ.2700 కోట్లు.. కానీ చివరకు బిగ్ ట్విస్ట్...

UP Labour Becomes Billionaire: ఇటుక బట్టీల్లో పొద్దంతా కష్టపడి రోజుకు రూ.600 సంపాదించే ఓ కూలీకి కలలో కూడా ఊహించినంత డబ్బు వచ్చి పడింది. అక్షరాలా రూ.2700 కోట్లు ఆ కూలీ ఖాతాలో జమయ్యాయి. కానీ ఆ ఆనందం అతనికి ఎంతోసేపు నిలవలేదు. పొరపాటును గుర్తించిన బ్యాంక్ సిబ్బంది అతని ఖాతాలో జమైన డబ్బును వెనక్కి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ ఘటన చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కి చెందిన బిహారీ లాల్ అనే వ్యక్తి రాజస్తాన్‌లోని ఇటుక బట్టీల్లో కూలీగా పనిచేస్తున్నాడు. రోజుకు రూ.600-రూ.800 వరకు సంపాదిస్తాడు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఇటుక బట్టీలు మూతపడ్డాయి. దీంతో యూపీలోని స్వగ్రామానికి వచ్చేశాడు. ఈ క్రమంలో ఇటీవల తన బ్యాంకు ఖాతాలోని డబ్బును డ్రా చేసుకునేందుకు స్థానిక జనసేవా కేంద్రానికి వెళ్లాడు. 

అక్కడ తన ఖాతా నుంచి రూ.100 విత్ డ్రా చేశాడు. ఆ వెంటనే తన సెల్‌ఫోన్‌కి వచ్చిన మెసేజ్ చూసి లాల్ షాకయ్యాడు. అందులో తన ఖాతాలో రూ.2700 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించింది. దీంతో వెంటనే బ్యాంక్ మిత్ర వద్దకు వెళ్లిన బిహారీ లాల్.. తన ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో చెక్ చేయాలని కోరాడు. రూ.2700 కోట్లు ఉన్నట్లు చెప్పడంతో నమ్మలేకపోయాడు. కానీ బ్యాంక్ స్టేట్‌మెంట్ ప్రింట్ చేసి ఇవ్వడంతో నమ్మక తప్పలేదు.

వెంటనే బ్యాంక్ పాస్ బుక్ తీసుకుని తన బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కి బయలుదేరాడు. కానీ అప్పటికే అతని ఖాతాలో జమైన డబ్బును బ్యాంక్ సిబ్బంది వెనక్కి తీసేసుకున్నారు. బిహారీ లాల్ ఖాతాలో కేవలం రూ.126 మాత్రమే ఉన్నట్లు చెప్పారు. పొరపాటు వల్లే అలా జరిగిందని... కొద్దిసేపు లాల్ ఖాతాను స్తంభింపజేసి ఆ డబ్బును వెనక్కి తీసుకున్నట్లు జిల్లా బ్యాంక్ అధికారి అభిషేక్ సిన్హా తెలిపారు. యూపీలోనే కాదు గతంలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

Also Read: MUNUGODE BYELECTION LIVE UPDATES: చిల్లర దొంగ.. బ్లాక్ మెయిలర్! రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి ఫైర్

Also Read: Uma Maheshwari Last Rites: ముగిసిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు.. పాడె మోసిన సోదరుడు బాలకృష్ణ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News