7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్రిబుల్ బొనంజా.. DA, TA, HRA పెంపు..?

7th Pay Commission Latest Updates: ప్రస్తుతం డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో భారీ ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. డీఏ పెంపుతోపాటు హెచ్‌ఆర్‌ఏ, టీఏ పెంపు ఉండే అవకాశం ఉంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Feb 22, 2024, 12:52 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్రిబుల్ బొనంజా.. DA, TA, HRA పెంపు..?

7th Pay Commission Latest Updates: వచ్చే నెలలో కేంద్ర ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్తలు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మూడు ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. డీఏ పెంపుతోపాటు ట్రావెల్ అలవెన్స్, హెచ్‌ఆర్‌ఏలో సవరణలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 46 శాతం డీఏ అందుతుండగా.. హోలీ సందర్భంగా 4 శాతం డీఏ పెంచే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే మొత్తం డీఏ 50 శాతానికి చేరనుంది. అదేవిధంగా ఉద్యోగుల గ్రేడ్ ప్రకారం టీఏ కూడా పెంచే అవకాశం ఉంది. హెచ్‌ఆర్‌ఏలో కూడా 3 శాతం వరకు పెంపు ఉంటుందని చెబుతున్నారు. 

Also Read: Janasena vs Tdp: సీట్ల లెక్క తేలకుండానే నేతల మధ్య మొదలైన రాజమండ్రి రూరల్ పంచాయితీ

డీఏ పెంపునకు మార్చి నెలలో కేంద్ర మంత్రి వర్గం గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వనుంది. డీఏ పెంపుతో తర అలవెన్సులు కూడా పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పెంచినా.. జనవరి 1వ తేదీ నుంచి డీఏ పెంపు వర్తించనుంది. జూలై నుంచి డిసెంబర్ 2023 వరకు AICPI ఇండెక్స్ పాయింట్స్‌ ఆధారంగా కేంద్ర ఉద్యోగులకు 50 శాతం డియర్‌నెస్ అలవెన్స్ అందుతుందని దాదాపు ఖరారు అయింది. 

డీఏ పెంపు తరువాత ట్రావెల్ అలవెన్స్ (TA)లో కూడా పెరుగుదల ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణ భత్యాన్ని జీతం చెల్లింపు బ్యాండ్‌తో కలిపితే.. డీఏ పెంపుతో కలిపితే ఒకేసారి జీతంలో భారీ పెరుగుదల ఉండనుంది. ట్రావెల్ అలవెన్స్ ఉద్యోగులు నివసించే ప్రాంతాలను బట్టి ఉంటుంది. అధిక TPTA నగరాల్లో గ్రేడ్ 1 నుంచి 2 వరకు ప్రయాణ భత్యం రూ.1800 నుంచి రూ.1900 వరకు అందుతోంది. గ్రేడ్ 3 నుంచి 8 వరకు రూ.3600+DA లభిస్తుంది. అయితే ఇతర ప్రదేశాలకు ఈ రేటు రూ.1800+DA గా ఉంది.

ఉద్యోగుల హౌస్ రెంట్ అలవెన్స్ (HRA)లో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. మార్చిలో డీఏ పెంపు తర్వాత ఇందులో కూడా సవరణ ఉంటుంది. నిబంధనల ప్రకారం.. డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతం దాటితే హెచ్ఆర్ఏ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం హెచ్‌ఆర్‌ఏ 27, 24, 18 శాతం చొప్పున అందజేస్తున్నారు. ఇది నగరాల Z, Y, X కేటగిరీలుగా విభజించారు. డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతం ఉంటే.. హెచ్‌ఆర్‌ఏ కూడా 30, 27, 21 శాతానికి పెరుగుతుంది. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మూడు ప్రకటనలు చేస్తుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు. త్వరలోనే అధికారికంగా క్లారిటీ రానుంది.

Also Read: Oneplus 12 Vs Oneplus 12R: ఈ రెండు మొబైల్స్‌లో ఫీచర్స్‌, ధర పరంగా ఇదే బెస్ట్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News