Summer Heat: ఎండ కూడా క్యాన్సర్ కి కారకమే.. వేసవికాలం గురించి షాకింగ్ నిజాలు

Cancer due to summer heat : బయట ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఉదయం 8:30 నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం సమయంలో.. కనీసం 10 నిమిషాలు కూడా బయట కూర్చోలేని పరిస్థితివచ్చేసింది. ఎక్కువసేపు ఎండలోనే ఉంటుంటే సన్ బర్న్స్ కూడా ఎక్కువఅవుతాయి. కానీ సన్ బర్న్ వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 5, 2024, 07:25 PM IST
Summer Heat: ఎండ కూడా క్యాన్సర్ కి కారకమే.. వేసవికాలం గురించి షాకింగ్ నిజాలు

Summer Care Tips: ఈ సంవత్సరం ఎండలు మరీ విపరీతంగా ఉన్నాయి. ప్రతిరోజు ఎండవేడి పెరుగుతూ పోతుంది.. తప్ప తగ్గడం లేదు. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడం కష్టతరంగా మారిపోయింది. అత్యంత అవసరం ఉన్నా కూడా ఎండ వేడి తట్టుకోలేక ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. 

కొందరికి మాత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళక తప్పదు. మరీ ముఖ్యంగా ఎండలోనే ఉంటూ పని చేసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అంతసేపు ఎండ వేడిని భరిస్తూ ఉండడం వల్ల.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.

ఎక్కువసేపు ఎండలో ఉంటే సూర్యకిరణాలు మన మీద డైరెక్ట్ గా పడతాయి. ఆ రేడియేషన్ మన చర్మాన్ని తాకి.. చర్మకణాల్లో ఉండే డీఎన్ఏ కి హాని కలిగిస్తుందట. దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది అని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఎండలో ఎక్కువసేపు ఉండకూడదని, ఒకవేళ ఉండాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు. ఎండలో ఎక్కువసేపు ఉంటే, ఎలాంటి క్యాన్సర్లు వస్తాయో తెలుసుకుందాం..

మెలీనోమా క్యాన్సర్ : 

దీన్ని చర్మ క్యాన్సర్ అని అంటారు. ఎక్కువగా ఎండలో ఉండడం వల్ల ఈ క్యాన్సర్ సోకుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. సర్జరీ, ఆ తరువాత కీమోథెరపీ, రేడియో థెరపీ వల్లనే ఇది నయమవుతుంది. 

బేసల్ సెల్ కార్సినోమా క్యాన్సర్ : 

సూర్యుడి వేడి మన చర్మలోకి డైరెక్ట్ గా చొచ్చుకుపోతే ఈ చర్మ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఎక్కువగా ముఖం, పెదవి, ముక్కు, చెవి, భుజాలు, వంటి ప్రదేశాల్లో వస్తుంది. దీనికి తగ్గ చికిత్స  కూడా అందుబాటులో ఉంది.. కానీ సర్జరీ, రేడియో థెరపీ మాత్రం తప్పవు.

స్క్రామస్ సెల్ కార్సినోమా క్యాన్సర్:

చర్మ క్యాన్సర్‌లలో ఇది ఒక రకం. ఇది కూడా ఎండలో ఎక్కువ సేపు ఉండేవారికి సోకుతుంది. ఎండలో ఎక్కువగా ఉంటే, ఎక్కువ శాతం ఎండ వేడి కి ఎక్స్ పోజ్ అయిన ప్రాంతం లో ఈ క్యాన్సర్  వస్తుంది. ముఖ్యంగా ముఖం, చెవులు, మెడ, చేతులపై ఈ క్యాన్సర్‌ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కూడా సర్జరీ వల్ల మాత్రమే నయం అవుతుంది. 

కాబట్టి ఎంత వీలైతే అంత ఎండలో ఎక్కువసేపు ఉండకపోతే సరి. ఒకవేళ కచ్చితంగా బయట ఎండాలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చినా కూడా.. తగిన జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే క్యాన్సర్ బారిన పడకతప్పదు.

Read more: Nomination On Buffallo: అట్లుంటదీ మరీ.. బర్రెమీద ఊరేగింపుగా వచ్చి నామినేషన్.. వైరల్ గా మారిన వీడియో.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News