Rashmika Mandanna: రష్మికా కి అరుదైన సత్కారం…టోక్యోకి పయనమైన బ్యూటీ..

Rashmika Viral Video: తన అందం, అభినయం తో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న నేషనల్ క్రష్ రష్మిక. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఒక అరుదైన సత్కారం అందుకొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.. ఇంతకీ ఆరుదైన సత్కారం ఏమిటో ఒకసారి చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 29, 2024, 02:02 PM IST
Rashmika Mandanna: రష్మికా కి అరుదైన సత్కారం…టోక్యోకి పయనమైన బ్యూటీ..

Rashmika Gets Anime Award: ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ను పలకరించి.. గీత గోవిందం తో ఓ ఫ్యామిలీ మెంబర్ గా మారిపోయింది రష్మిక. క్యూట్ ఎక్స్ప్రెషన్స్.. అంతకుమించి క్యూట్ గా చెప్పే డైలాగ్స్.. తెలుగుతనం ఉట్టిపడేలా ఉండే అందం.. రష్మిక సొంతం. దీంతో కుర్రకారులోనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా రష్మికకు మాంచి క్రేజ్ వచ్చింది. అతి తక్కువ కాలంలోని ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన నటనతో అందరి మనసులు దోచుకున్న రష్మిక ఇప్పుడు మరొక కొత్త రికార్డును నెలకొల్పింది.

టోక్యోలో జరుగుతున్న ఓ అవార్డు ఈవెంట్ కు హాజరు కావడానికి రష్మిక జపాన్ కు వెళ్తోంది. అయితే ఇందులో ఏంటి అంత ఆశ్చర్యం అనుకుంటున్నారా?యానిమీ అవార్డు అందుకోవడం కోసం రష్మిక ఇండియా నుంచి వెళ్తున్న తొలి సెలెబ్రిటీ కావడం గమనార్హం. దీంతో ప్రస్తుతం ఈ క్యూట్ బ్యూటీ ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

జపాన్ బయలుదేరిన రష్మిక ..టోక్యో కాలింగ్ అంటూ ఫ్లైట్ ఎక్కి క్యూట్ స్మైల్ తో ఫోటోలు తీసుకొని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ల స్ప్రెడ్ అయిపోయాయి. షూటింగ్ బిజీలో ఉన్న రష్మిక ఇలా సడన్గా జపాన్ కు ఎందుకు వెళ్తుంది అని నెటిజన్స్ ఆరా తీయగా అవార్డు ఫంక్షన్ కోసం అన్న విషయం బయటకు వచ్చింది. యానిమల్ మూవీ తర్వాత షూటింగ్ లో చాలా బిజీ అయిపోయిన రష్మిక ఆ మూవీ సక్సెస్ మీట్ లో కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో రష్మిక ఏదో విషయానికి హార్ట్ అయిందని అందుకే యానిమల్ మూవీ సక్సెస్ మీట్ లో కనిపించలేదు అంటూ జోరుగా ప్రచారాలు జరిగాయి. 

అయితే ఇవేవీ నిజాలు కాదు అని తేల్చి చెప్పిన రష్మిక.. తను కేవలం షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్లే పార్టీలో భాగం కాలేకపోయాను అని క్లారిటీ ఇచ్చింది.త్వరలో రష్మిక పుష్ప 2 చిత్రం విడుదల కాబోతోంది. పుష్ప చిత్రంతో శ్రష్మిక క్రేజ్ ఏ లెవెల్ లో పెరిగిందో అందరికీ తెలుసు. ఇక దీని సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 చిత్రం తర్వాత ఆమె క్రేజ్ ఇంతకి ఇంత పెరిగే అవకాశం ఉంది. ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీలో కూడా రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే. ఇవి కాక మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా రష్మిక ఖాతాలో ఉన్నట్టు టాక్.

Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..

Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News