OTT Movies: సినీ ప్రేమికులకు పండుగే, ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు, నాగచైతన్య దూత వెబ్‌సిరీస్ ఎప్పుడంటే

OTT Movies: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. ఈ వారం పెద్దఎత్తున సినిమాలు విడుదల కానున్నాయి. సినిమాలతో పాటు ప్రముఖ నటుల వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 29, 2023, 04:43 PM IST
OTT Movies: సినీ ప్రేమికులకు పండుగే, ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు, నాగచైతన్య దూత వెబ్‌సిరీస్ ఎప్పుడంటే

OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీలకు క్రేజ్ పెరుగుతోంది. విభిన్న భాషల్లో కావల్సిన సినిమాలు లేదా వెబ్‌సిరీస్‌లు నచ్చినప్పుడు చూసే అవకాశముండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే ప్రతి కొత్త సినిమా థియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ రెండూ ప్రకటిస్తున్నారు. 

ఓటీటీలకు ఆదరణ పెరుగుతుండటంతో వాటి సంఖ్య కూడా పెరుగుతోంది. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5, జియో సినిమా, వూట్, ఆహా, సన్ నెక్స్ట్ ఇలా చాలా ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ప్రతి వారం సినిమాల సందడి ఉంటోంది. ముఖ్యంగా చాలావరకూ ఓటీటీ సినిమాలు శుక్రవారం విడుదలవుతుంటాయి ఈసారి కూడా వివిద ఓటీటీ వేదికల్లో వచ్చే శుక్రవారం భారీగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టి నాగచైతన్య నటించిన దూత వెబ్‌సిరీస్‌పై ఉంది. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో వివిధ ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు, ఓటీటీల వివరాలు ఇలా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో...

నవంబర్ 30వ తేదీన అమెరికన్ సింఫనీ, బ్యాడ్ సర్జన్, ఫ్యామిలీ స్విచ్, ఓబ్లిటెరేటెడ్, హార్ట్ డేస్, ది బ్యాడ్ గయ్స్, వర్జిర్ రివర్ సీజన్ 5 పార్ట్ 2, స్కూల్ స్పిరిట్స్ సీజన్ 1, ది బిగ్ అగ్లీ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక డిసెంబర్ 1న మామసపనో, మిషన్ రాణిగంజ్, స్వీట్ హోమ్ సీజన్ 2, ది ఈక్వలైజర్, బాస్కెట్ బాల్ వైవ్స్ స్ట్రీమ్ కానున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో..

డిసెంబర్ 1న ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ, మాన్‌స్టర్ ఇన్‌సైడ్, ది షెఫర్డ్ విడుదల కానున్నాయి.

అమెజాన్ ప్రైమ్‌లో..

నవంబర్ 30వ తేదీన షెహర్ లఖోట్ వెబ్‌సిరీస్, డిసెంబర్ 1న నాగచైతన్య నటించిన దూత తెలుగు వెబ్‌సిరీస్, క్యాండీ కేన్ లైన్ స్ట్రీమింగ్ కానున్నాయి. 

జియో సినిమాలో..

జర హట్కే జర బచ్కే, 800 సినిమాలు విడుదల కానున్నాయి.

Also read: Shradda Das: తెల్ల చీరలో వెన్నెలల మెరిసిపోతున్న శ్రద్ధా దాస్.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News