Nagarjuna as Police In Kubera: మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున..

Nagarjuna as Police In Kubera: నాగార్జున అక్కినేని చాలా కాలం తర్వాత మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల చిత్రంలో ఈయన పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా విడుదల చేసిన టీజర్‌లో చూపించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 3, 2024, 12:05 PM IST
Nagarjuna as Police In Kubera: మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున..

Nagarjuna as Police In Kubera: నాగార్జున అక్కినేని 'బంగార్రాజు' తర్వాత ఈ సంక్రాంతి పండక్కి.. 'నా సామిరంగ' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఒకవైపు హనుమాన్, మరోవైపు మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలతో పోటీ పడుతూ ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించడం మాములు విషయం కాదు. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర' మూవీ చేస్తున్నాడు. ధనుశ్ ఈ సినిమాలో మెయిన్ హీరోగా నటిస్తున్నాడు. రష్మిక మందన్న  కథానాయికగా నటిస్తోంది. తాజాగా 'కుబేర' మూవీ నుంచి నాగార్జున లుక్‌ను విడుదల చేసారు. ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.

నాగార్జున అరణ్య కాండ, శాంతి క్రాంతి, ఖుదాగవా, రక్షణ, శివమణి తదితర చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపించాడు. ఇపుడు చాలా యేళ్ల 'కుబేర'లో నిజాయితీ గత పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు ఈ సినిమాలో నాగార్జున పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌లో చూపించారు. నిండా నోట్లతో ట్రక్కుతో ఉన్న కంటెనర్ నుంచి ఒక చినిగిపోయిన రూ. 500 నోటు కనిపిస్తోంది. దీంతో తన జేబులోని నోటును అక్కడ పెట్టి తన నిజాయితీని చాటుకునే సీన్‌తో ఇందులో హీరో పాత్ర ఎలాంటిందో చూపించాడు.  మొత్తంగా 'కుబేర' సినిమాలో తన పాత్రతో  ఈ మూవీపై అంచనాలు పెంచేలా చేయడంలో శేఖర్ కమ్ముల సక్సెస్ అయ్యాడు.

ఈ చిత్రాన్ని ఏషియన్ ఫిల్మ్స్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల మరో  నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు.  రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. నాగార్జున నటించిన 'నా సామిరంగ' సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా 1980 బ్యాక్ డ్రాప్‌లో వచ్చి మంచి హిట్ అందుకుంది. ఈ మూవీ రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగి ఓవరాల్‌గా రూ. 21.88 కోట్ల షేర్ ( రూ. 40 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి సక్సెస్‌గా నిలిచింది. మొత్తంగా ఈ యేడాది హనుమాన్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న రెండో చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదీ చదవండి: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News