OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్ రిలీజ్ సినిమాలివే, ఏకంగా 40 సినిమాలతో సందడి

OTT Movies: దసరా సెలవుల సందడి మొదలైంది. ఓ వైపు పండుగ షాపింగ్ జరుగుతోంది. మరోవైపు కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. అక్టోబర్ 29న బాలయ్య, మాస్ మహారాజా సినిమాలు పోటీపడనున్నాయి. అదే సమయంలో ఓటీటీలో భారీగా సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్దంగా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2023, 10:08 AM IST
OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్ రిలీజ్ సినిమాలివే, ఏకంగా 40 సినిమాలతో సందడి

OTT Movies: దసరా కావడంతో ఈ వారం అటు ధియేటర్ ఇటు ఓటీటీ వేదికలు రెండూ బిజీగా ఉండనున్నాయి. ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా థియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ కచ్చితంగా ముందే నిర్ధారణ అవుతోంది. దసరా సెలవుల్లో అటు ధియేటర్, ఇటు ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం.

ఈ వారమంతా కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. కొన్ని థియేటర్లలో విడుదల కానుండగా, మరికొన్ని ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. దళపతి విజయ్ నటించిన లియో సినిమా ఈ వారంలోనే విడుదల కానుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలవుతోంది. ఇక బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా కూడా అక్టోబర్ 19న థియేటర్లలో హల్‌చల్ చేయనుంది. ఇక మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు కూడా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా చిన్న సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. మరోవైపు ఈ వారం ఏకంగా 40 వరకూ సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. 

అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ సినిమాలు

అక్టోబర్ 18న పర్మినెంట్ రూమ్‌మేట్స్ సీజన్ 3 వెబ్‌సిరీస్ స్ట్రీమ్ కానుంది. అక్టోబర్ 18న ద వ్యాండరింగ్ ఎర్త్ 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక అక్టోబర్ 20న సుధీర్ బాబు నటించిన మాయా మశ్చీంద్ర సినిమా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 20నే మరో సినిమా ది అదర్ జోయ్ స్ట్రీమ్ అవుతోంది. అక్టోబర్ 20న సయెన్ డిసర్ట్ రోడ్, ట్రాన్స్ ఫార్మర్స్- ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్, అప్‌లోడ్ సీజన్ 3 వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం సినిమాలు

అక్టోబర్ 16న రిక్ అండ్ మార్టీ సీజన్ 7 వెబ్‌సిరీస్, అక్టోబర్ 17న ఐ వోకప్ ఎ వ్యాంపైర్, ద డెవిల్ ఆన్ ట్రయల్ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అక్టోబర్ 18న సింగపన్నే, కాలాపానీ విడుదలవుతున్నాయి. ఇక అక్టోబర్ 19వ తేదీన బాడీస్, కెప్టెంన్ లేజర్ హాక్-ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్, క్రిప్టోబాయ్, నియాన్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలకానున్నాయి. అక్టోబర్ 209న క్రియేచర్, ఎలైట్ సీజన్ 7 వెబ్‌సిరీస్, కండాసమ్స్- ది బేబీ, ఓల్డ్ డాడ్స్, సర్వైవింగ్ ప్యారడైజ్, పెయిన్ హజ్లర్స్, జెరాన్ టోమిక్ స్ట్రీమింగ్ కానున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ సినిమాలు

అక్టోబర్ 16న వన్స్ అపాన్ ఎ స్డూడియో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 17న మ్యాన్షన్ 24 స్ట్రీమింగ్ ఉంది.

ఇక ఆహా ఓటీటీలో అక్టోబర్ 17న అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ స్ట్రీమ్ కానుండగా, అక్టోబర్ 20వ రెడ్ శాండల్ వుడ్ విడుదలవుతుంది.

మరో ఓటీటీ వేదిక బుక్ మై షోలో అక్టోబర్ 17న మోర్టల్ కంబాట్ లెజెండ్స్ , షార్ట్ కమింగ్స్, అక్టోబర్ 18న టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టిల్స్, అక్టోబర్ 19న ద నన్ 2, అక్టోబర్ 20న మై లవ్ పప్పీ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. 

Also read: Pushpa 2: "పుష్ప"రాజ్ కథ కి "పుష్ప 2" తో కూడా ముగింపు ఉండదా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News