Kalki2898AD Bujji: ఎంతో క్యూట్ గా ప్రభాస్ బుజ్జి.. ఆకట్టుకున్న కల్కి అప్డేట్

Kalki2898AD update: ప్రభాస్ కల్కి 2898AD  సినిమా గురించి ప్రపంచమంతా ఎంతగానో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చిన బుజ్జి అప్డేట్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.. ఇంతకీ ఆ బుజ్జి ఎవరంటే?

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 18, 2024, 09:46 PM IST
Kalki2898AD Bujji: ఎంతో క్యూట్ గా ప్రభాస్ బుజ్జి.. ఆకట్టుకున్న కల్కి అప్డేట్

Prabhas Kalki: నాగ అశ్విన్ దశకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898AD సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ చిత్ర మేకర్స్ ఈరోజు విడుదల చేసిన బుజ్జి అప్డేట్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది.

నిన్న ప్రభాస్ తన సోషల్ మీడియాలో ముందుగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నానని పోస్ట్ పెట్టారు. దాంతో అభిమానులు అందరూ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు అంటూ తెగ ఎదురుచూశారు. ఇక అలా పెట్టిన కాసేపటికి ప్రభాస్ మళ్ళీ ‘కల్కి సినిమా నుంచి నా బుజ్జిని పరిచయం చేస్తా’.. అని పోస్ట్ చేయడంతో అంతా ఆ అప్డేట్ కోసం ఎదురుచూశారు. 

అసలు ఈ బుజ్జి ఎవరు అని నిన్నటి నుంచి సినీ ప్రేక్షకులు అందరూ తెగ రీసెర్చ్ లు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఫైనల్ గా ఈ సస్పెన్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ కల్కి టీం బుజ్జి ప్రోమోని విడుదల చేసింది. ‘మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో.. అచ్చం అలానే బుజ్జిని కూడా ఓ బ్రెయినే  కంట్రోల్ చేస్తుంది’ అని ఈ ప్రోమో మొదలవుతుంది. అందులో బుజ్జిగా ఓ బుజ్జి రోబో ని చూపించాడు. బుజ్జి ఈ ప్రోమో మొత్తం ఎంతో క్యూట్ గా మాట్లాడుతూ.. అందరినీ ఆకట్టుకుంది.. ‘సచ్చినోడా’ అంటూ తిట్లు కూడా తిడుతోంది. అంతేకాదు నాగ్ అశ్విన్ దగ్గర ఎవ్వరూ డెడ్ లైన్ ని ఫాలో అవ్వడం లేదు అంటూ.. కల్కి రిలీజ్ డేట్ వాయిదా పై సెటైళ్లు కూడా వేసింది.

ఇక బుజ్జిని తయారు చేసిన వారిని ఈ వీడియోలో పరిచయం చేశారు. ‘బుజ్జి అంటే వాహనం మాత్రమే కాదు.. ఇదో ఒక సూపర్ హీరో’ అని బుజ్జి పైన ఆసక్తి తప్పించాడు. బుజ్జి పూర్తి రూపాన్ని మే22న చూపిస్తామని ఫైనల్ గా తెలియచేశారు.

కాగా 400 కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ముందుగా మే 9న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడి జూన్ 27న విడుదల కాబోతోంది. మరి ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే అప్పటి వరకు వేచి చూడాలి.

 

 

Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News