Hyper Aadi : ఇంద్రజ ఇజ్జత్ తీసిన హైపర్ ఆది.. కొట్టేందుకు వచ్చిన సీనియర్ నటి

Hyper aadi Satires on Indraja హైపర్ ఆది తాజాగా ఇంద్రజ, రష్మీల డ్యాన్స్ మీద కౌంటర్లు వేశాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో రష్మీ డ్యాన్స్‌ మీద నరేష్, ఇంద్రజ డ్యాన్స్ మీద ఆది కౌంటర్లు వేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 1, 2023, 05:16 PM IST
  • నెట్టింట్లో ఇంద్రజ సందడి
  • పరువుతీస్తోన్న హైపర్ ఆది
  • ఇంద్రజ, రష్మీల డ్యాన్స్‌
Hyper Aadi : ఇంద్రజ ఇజ్జత్ తీసిన హైపర్ ఆది.. కొట్టేందుకు వచ్చిన సీనియర్ నటి

Hyper aadi Satires on Indraja Dance హైపర్ ఆది బుల్లితెరపై ఎంతలా సందడి చేస్తుంటాడో అందరికీ తెలిసిందే. ఆది వేసే పంచ్‌లకు అందరూ పగలబడి నవ్వాల్సిందే. ఆది అవతల ఎవరున్నా కూడా తనకు నచ్చినట్టుగా, నోటికి వచ్చినట్టుగా పంచ్‌లు వేస్తుంటాడు. ఆది పంచ్‌లకు యాంకర్లు, జడ్జ్‌లు ఇలా అందరూ బలవుతుంటారు. తాజాగా ఇంద్రజ డ్యాన్స్ మీద ఆది దారుణంగా కౌంటర్లు వేశాడు. అసలే ఇప్పుడు ఆది బుల్లితెరపై తక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టేశాడు.

ఒకప్పుడు ఆది అయితే జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలతో సందడి చేసేవాడు. మధ్యలో ఢీ, జబర్దస్త్ వంటి షోలకు దూరంగా ఉండిపోయాడు. కానీ శ్రీదేవీ డ్రామా కంపెనీలో మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చాడు. ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్‌కు ఆది దూరంగానే ఉంటున్నాడు. వెండితెర, బుల్లితెరకు ఒకే సారి టైంను కేటాయించలేకపోతోన్న ఆది.. ఇప్పుడు సినిమాలతోనే ఎక్కువగా బిజీగా ఉంటున్నాడు.

అయితే శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఆది చేస్తోన్న కామెడీ, వేస్తోన్న కౌంటర్లు మామూలుగా ఉండటం లేదు. బాబు అంటూ రష్మీ మీద, ఇంద్రజ చెప్పే జడ్జ్మెంట్లు, పాడే పాటలు, వేసే డ్యాన్సుల మీద ఆది కౌంటర్లు వేస్తుంటాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ ఇంద్రజ ఇజ్జత్ తీసేశాడు ఆది. గత రెండు మూడు వారాల క్రితం ఇంద్రజ డ్యాన్స్ వేసింది. కీర్తి సురేష్‌లా వెన్నెల సెలెబ్రేషన్స్ అంటూ.. ఇంద్రజ సెలెబ్రేషన్స్‌ను రీ క్రియేట్ చేసింది.

Also Read: Keerthy Suresh Marriage: కీర్తి సురేష్ పెళ్లిపై తండ్రి క్లారిటీ..అసలు విషయం చెప్పేశాడుగా!

ఇంద్రజ నాడు వేసిన స్టెప్పులను నేడు ఇమిటేట్ చేశాడు. గాలి సోకితే ఏం చేస్తారు అని అడగటం.. రష్మీ వేసే స్టెప్పులను వెక్కిరిస్తూ నరేష్ చూపించడం, ఇంద్రజ వేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేస్తూ ఆది చూపించడం ప్రోమోలో కనిపిస్తోంది. ఇక తన డ్యాన్సుల మీద కౌంటర్లు వేస్తుండటంతో.. ఆదిని కొట్టబోయింది ఇంద్రజ. మొత్తానికి వారి డ్యాన్సులను మాత్రం ఆది గట్టిగానే ఇలా ట్రోల్ చేస్తున్నాడు.

Also Read: Adipurush Rights: చివరి నిముషంలో ప్రభాస్ ప్రాజెక్టుల నుంచి యూవీ క్రియేషన్స్ ఔట్.. అసలు విషయం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News