Hyper Adi Arrest: కమెడియన్ హైపర్ ఆది అరెస్ట్..? షో మధ్యలోనే అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలేం జరిగింది..

Comedian Hyper Adi Arrest: కమెడియన్ హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారా.. కార్ యాక్సిడెంట్ కేసులో ఆది బుక్ అయ్యారా... ఆది కమెడియన్‌గా కనిపించే ఓ టీవీ షోలోకి సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2022, 09:44 AM IST
  • కమెడియన్ హైపర్ ఆది అరెస్ట్..?
  • షో మధ్యలో ఆదిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • కారు యాక్సిడెంట్ కేసులో ఆది అరెస్ట్..
  • ఇదంతా నిజమేనా.. లేక వట్టి ప్రాంకా..?
Hyper Adi Arrest: కమెడియన్ హైపర్ ఆది అరెస్ట్..? షో మధ్యలోనే అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలేం జరిగింది..

Comedian Hyper Adi Arrest: ఇటీవలి కాలంలో సినిమాలు, టీవీ షోల ప్రమోషన్లలో సెన్సేషనలిజం ఎక్కువగా కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా ప్రమోషన్‌లో భాగంగా నడిరోడ్డుపై పెట్రోల్ క్యాన్‌తో ఓ వ్యక్తి హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద రచ్చే జరిగింది. కొందరు విశ్వక్ సేన్‌ను సమర్థిస్తే.. మరికొందరు అతన్ని తప్పు పట్టారు. తాజాగా హైపర్ ఆది కమెడియన్‌గా కనిపించే ఓ టీవీ షోలో సెన్సేషనలిజంతో ప్రేక్షకుల అటెన్షన్‌ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.

హైపర్ ఆది ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షో లేటెస్ట్ ప్రోమోని విడుదల చేశారు. ఆద్యంతం నవ్వులతో సాగిన ఈ ప్రోమో క్లైమాక్స్‌లో అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. చివరలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి హైపర్ ఆదిని అరెస్ట్ చేస్తారు. అనుకోని ఈ పరిణామానికి అక్కడున్నవారు షాక్ అవుతారు. కారు యాక్సిడెంట్ కేసులో ఆదిని అరెస్ట్ చేస్తున్నామని... అతని నిర్లక్ష్య డ్రైవింగ్‌కి ఒకరు చావు బతుకుల్లో ఉన్నారని పోలీసులు చెబుతారు. ఇక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.

ప్రోమో క్లైమాక్స్‌లో కనిపించే ఈ సీన్ చాలా ఇంటెన్స్‌గా కనిపించినప్పటికీ.. ఇదంతా వట్టి ప్రాంక్ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం షో ప్రమోషన్ కోసమే నకిలీ పోలీసులతో ఇలా చేయించారని అంటున్నారు. అసలు హైపర్ ఆదికి డ్రైవింగే రాదని.. ఈ విషయాన్ని ఆయనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పారని గుర్తుచేస్తున్నారు. డ్రైవింగే రాని వ్యక్తి కార్ యాక్సిడెంట్ చేయడమేంటని.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా టీఆర్పీ స్టంట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ షోకి నిన్న, మొన్నటిదాకా సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా, ఇంద్రజ జడ్జిగా వ్యవహరించారు. కానీ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరి స్థానంలో రష్మీ, పూర్ణ కనిపించారు. ఈ ప్రోమోలో ఆటో రాంప్రసాద్.. నీకు సన్మానం చేయాలనుకుంటున్నానని హైపర్ ఆదితో చెప్తాడు. దానికి హైపర్ ఆది.. సన్మానం చేసి నన్ను కూడా వాడిలా పంపించేద్దామనుకున్నారా.. అంటూ పరోక్షంగా సుధీర్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. ఆది, రాంప్రసాద్ కామెడీతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం హాస్యభరితంగా సాగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

Also Read: Mahesh Vijay Combo: క్రేజీ కాంబినేషన్.. ఒకే స్క్రీన్‌పై సూపర్ స్టార్స్ మహేష్ బాబు, విజయ్..?

Also Read:  Horoscope Today June 8th : నేటి రాశి ఫలాలు... ఆ రాశి వారికి లవ్ ప్రపోజ్‌కు అనుకూలమైన రోజు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News