Jabardasth Anchor Sowmya : యాంకర్ రష్మీకే ఎసరు పెట్టేసింది.. దుమ్ములేపేసిన జబర్దస్త్ యాంకర్ సౌమ్య

Jabardasth Anchor Sowmya in Sridevi Drama Company జబర్దస్త్ బ్యూటీ యాంకర్ సౌమ్య తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీకి సైతం వచ్చింది. అక్కడ కూడా పాగా వేయాలని సౌమ్య ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. రష్మీ స్థానానికి ఎసరు పెట్టాలని చూస్తోన్నట్టుగా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2022, 05:28 PM IST
  • ట్రెండింగ్‌లో జబర్దస్త్ యాంకర్ సౌమ్య
  • శ్రీదేవీ డ్రామా కంపెనీలోకి గ్రాండ్ ఎంట్రీ
  • రష్మీకి ధీటుగా నిలబడ్డ సౌమ్య
Jabardasth Anchor Sowmya : యాంకర్ రష్మీకే ఎసరు పెట్టేసింది.. దుమ్ములేపేసిన జబర్దస్త్ యాంకర్ సౌమ్య

Jabardasth Anchor Sowmya in Sridevi Drama Company జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ఆమె పంచ్‌లు, వచ్చీ రానీ తెలుగు మాటలు, ఆమెపై పడే కౌంటర్లు, ఆమె తిరిగి వేసే సెటైర్లు అన్నీ కూడా జనాలకు బాగానే నచ్చుతున్నాయి. అయితే ఆది, సౌమ్య ట్రాక్‌కు జనాలు బాగానే అలవాటు పడ్డారు. కానీ సడెన్‌గా ఆది మళ్లీ జబర్దస్త్ షోలో కనిపించకుండా పోయాడు. మళ్లీ కాస్త గ్యాప్ తీసుకుని వచ్చేలా ఉన్నాడు. అయితే ఆది జబర్దస్త్‌లోకి వచ్చే కంటే.. సౌమ్యను శ్రీదేవీ డ్రామా కంపెనీకి తీసుకెళ్తే బెటర్ అని మల్లెమాల టీం ఆలోచించినట్టుంది.

అసలే ఇప్పుడు యాంకర్లలో కొదవ ఏర్పడింది. అనసూయ ఈ యాంకరింగ్ నుంచి తప్పుకుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్నింటికి రష్మీనే ఉండేది. ఈ మధ్యే జబర్దస్త్ కోసం కొత్త యాంకర్‌ను పట్టుకొచ్చారు. మంజూష, స్రవంతి చొక్కారపు వంటి వారి పేర్లు జబర్దస్త్ యాంకర్ రేసులో వినిపించాయి. కానీ చివరకు ఆ లక్కీ చాన్స్ సౌమ్యకు దక్కింది. భలే మంచి రోజు అనే ఈవెంట్లో సౌమ్య వేసిన పంచ్‌లు, కనిపించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News