Miss Universe: 60 ఏళ్ల వయస్సులో మిస్ యూనివర్శ్ టైటిల్

Miss Universe: అందాల పోటీలంటే సహజంగా టీనేజ్ లేదా యుక్త వయస్సు అమ్మాయిలతో ఉంటుంది. టైటిల్ కూడా వాళ్లే గెల్చుకుంటారు. అరవయ్యేళ్ల వయస్సులో అందాల పోటీలంటే నమ్మలేకున్నారు కదూ..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 27, 2024, 07:36 PM IST
Miss Universe: 60 ఏళ్ల వయస్సులో మిస్ యూనివర్శ్ టైటిల్

Miss Universe: అరవయ్యేళ్ల వయస్సంటే సాధారణంగా ఇంట్లో మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకునే సమయం. కానీ ఓ అరవయ్యేళ్ల వృద్ధురాలు మాత్రం తాను అతీతురాలంటోంది. అందాల పోటీలు టీనేజ్ అమ్మాయిలకే అనే అభిప్రాయాన్ని పటాపంచలు చేసింది. అర్జంటీనాకు చెందిన ఈ 60 ఏళ్ల వృద్ధారాలు ఏం చేసిందో తెలుసుకుందాం..

ఈమె పేరు మారిసా రోడ్రిగ్జ్. వయస్సు 60 ఏళ్లు. దేశం అర్జెంటీనా. వృత్తి న్యాయవాది. అందమైన 20 ఏళ్ల ప్రాయంలోని యువతులతో పోటీ పడి మిస్ యూనివర్శ్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ గెల్చుకుని చరిత్ర లిఖించింది. ఈ వయస్సులో మిస్ యూనివర్శ్ టైటిల్ గెలిచిన తొలి మహిళ ఈమెనే. ఈ పోటీలు ఏప్రిల్ 24న జరిగాయి. ఈ పోటీల్ల 18-73 ఏళ్ల వయస్సు కలిగిన 34 మంది అమ్మాయిలు, మహిళలు పాల్గొనగా అందరితో పోటీ పడిన ఈ 60 ఏళ్ల ముదుసరి మారిసా రోడ్రిగ్జ్ టైటిల్ గెల్చుకుని అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇప్పుడీమె తదుపరి మే నెలలో జరిగే మిస్ యూనివర్శ్ అర్జెంటినా పోటీల్లో పాల్గొనవచ్చు. అందులో కూడా గెలిస్తే సెప్టెంబర్ నెలలో మెక్సికో వేదికగా జరిగే మిస్ యూనివర్శ్ 2024 పోటీల్లో పొల్గొనవచ్చు. ఇప్పుడీమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

న్యాయవాద వృత్తి కంటే ముందు జర్నలిజం చేశారు. చాలాకాలం నుంచి అందాల పోటీల్లో పాల్గొనాలని అనుకుంది. కానీ అందులో వయస్సు నిబంధనలు ఉండటంతో ఆమె పాల్గొనలేకపోయింది. కానీ 2023లో నిబంధనలు మారడంతో ఆమెలో ఉత్సాహం వచ్చింది. గతంలో అయితే మిస్ యూనివర్శ్ పోటీలుకు 18-28 ఏళ్ల మధ్యలో ఉండాలనుంది. కానీ తాజాగా 18-73 ఏళ్ల వయస్సువారిని కూడా అందాల పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించారు. 

Also read: Old vs New Tax Regime: పాత, కొత్త ట్యాక్స్ విధానాల్లో ఏది ఎవరు ఎంచుకోవాలి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News