Jyothi Rai: బుల్లితెర నటి జ్యోతి రాయ్ అసభ్యకర వీడియోలు లీక్.. సోషల్ మీడియాలో వైరల్

Jyothi Rai Private Video Leaked: నటి జ్యోతి రాయ్‌కు సంబంధించిన అసభ్యకర వీడియోలు లీక్ అయ్యాయంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. తమ యూబ్యూట్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేస్తే.. పూర్తి ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తామంటూ ఓ ట్విట్టర్ అకౌంట్‌ నుంచి పోస్ట్ వచ్చింది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2024, 04:41 PM IST
Jyothi Rai: బుల్లితెర నటి జ్యోతి రాయ్ అసభ్యకర వీడియోలు లీక్.. సోషల్ మీడియాలో వైరల్

Jyothi Rai Private Video Leaked: గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ భామ జ్యోతి రాయ్.. హాట్ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాలో రచ్చతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయంటూ ఆన్‌లైన్‌లో న్యూస్ వైరల్ అవుతోంది. రీసెంట్‌గా డీప్‌ ఫేక్‌ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో జ్యోతి రాయ్ వీడియోను కూడా మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనకు సంబంధించి ఫేక్ వీడియోలు, ఫేక్ ఫొటోలతో ప్రచారం చేస్తూ తన పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. 

Also Read: PBKS vs RCB Dream11 Team: పంజాబ్, ఆర్‌సీబీ మధ్య ఫైట్.. ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ నుంచి ఔట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇవే

ఎడిట్ బై అభి అనే ట్విట్టర్ అకౌంట్‌ నుంచి జ్యోతి రాయ్‌కు సంబంధించి ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ అయ్యాయి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేస్తే ఫుల్ వీడియోలు రిలీజ్ చేస్తామంటూ ఓ మెసేజ్ కూడా పెట్టారు. అయితే ఆ తరువాత అకౌంట్ నుంచి వీడియోలు, ఫొటోలు తొలగించారు. కానీ అప్పటికే చాలామంది ఆమె ఫొటోలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకుని వైరల్ చేశారు. ఈ ఘటనపై జ్యోతి రాయ్ పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు నిరంతరంగా మెసేజ్‌లు పంపుతూ మానసికంగా టార్చర్‌ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన పరువు, తన కుటుంబం పరువు తీస్తున్నారని.. పోలీసులు వెంటనే చర్య తీసుకోకపోతే ఇది కొనసాగే అవకాశం ఉందని అన్నారు. తనకు కోలుకోలేని సమస్యను సృష్టించే అవకాశం ఉందన్నారు.

తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు జ్యోతి రాయ్. ఈ సీరియల్‌లో లీడ్ రోల్ రుషికి తల్లి పాత్రను పోషించింది. ఈ రోల్ తన వయసు కంటే చాలా ఎక్కువైనా ఆమె రక్తికట్టించారు. అయితే సోషల్ మీడియాలో ఆమె హాట్ ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సీరియల్‌లో ఎంతో పద్ధతిగా కనిపించే జ్యోతి రాయ్.. ఇంత హాట్‌గా.. యంగ్‌గా మారిపోయిందంటూ కామెంట్స్ చేసేవారు. ఇక రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామర్ డోస్ పెంచుతూ ట్రీట్ ఇస్తోంది. 

డైరెక్టర్ సుకుమార్‌తో తన ప్రేమ గురించి జ్యోతి రాయ్ ఓపెన్ కామెంట్స్ చేశారు. తాజాగా వైరల్ అవుతున్న పిక్స్‌లో చేతిలో గ్లాస్ పట్టుకుని.. అతనికి దగ్గరగా హగ్ ఇస్తూ హాట్ కిస్ ఇస్తున్నట్లు ఉంది. అయితే ఇది కావాలని తీశారా..? లేదా మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారో క్లారిటీ రావాల్సి ఉంది. 

Also read: Muslim Reservations: ముస్లిం రిజర్వేషన్లు తీసి ఆ వర్గాలకిచ్చేస్తాం, అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News