Telangana: ఒకరోజు ముందే హడావిడిగా సొంతగూటికి వచ్చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Telangana: తెలంగాణలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ నేత కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరిపోయారు. అనుకున్న సమయం కంటే ఓ రోజు ముందే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 27, 2023, 07:42 AM IST
Telangana: ఒకరోజు ముందే హడావిడిగా సొంతగూటికి వచ్చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Telangana: తెలంగాణలోని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమక్షంలో ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరుతూనే రేవంత్ రెడ్డిపై పరోక్షంగా వ్యాఖ్యలతో వర్గ విబేధాలకు తెరతీశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో పార్టీల మధ్య నేతలు బదిలీ జరుగుతోంది. కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి బీజేపీ నుంచి పోటీ చేశారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో పరాజయం పొందారు. అప్పట్నించి బీజేపీలో అంత యాక్టివ్‌గా లేని రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో సొంతగూటికి వచ్చేశారు. వాస్తవానికి ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాల్సి ఉన్నా..సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభానికి ముందే పార్టీ సభ్యత్వం ఉండాలన్న సాంకేతిక కారణంతో హడావిడిగా పార్టీలో చేరిపోయారు. 

నిన్న అంటే గురువారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమక్షంలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే కండువా కప్పారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అధికారికంగా చేరనున్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందనేది ప్రజల నమ్మకమని, కేసీఆర్ అవినీతిని బీజేపీ ఎండగట్టలేకపోయిందని అందుకే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్టు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. 

పార్టీలో చేరుతూనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చని చెప్పారు. విబేధాల్ని పక్కనబెట్టి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తానా అనే ప్రశ్నకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీటైన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు శాశ్వతం కాదని, రేవంత్ రెడ్డికి సైతం టీపీసీసీ పదవి శాశ్వతం కాదు కదా అని బదులిచ్చారు. రెండు నెలల తరువాత ఎవరైనా అధ్యక్షుడు కావచ్చన్నారు.

Also read: CM KCR: నేను చావునోట్లో తలకాయపెట్టా.. పదేళ్లు ఏడిపించారు: సీఎం కేసీఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News