Revanth Reddy Chitchat: ఇక రాజకీయం ముగిసింది.. పరిపాలనపై దృష్టి సారిస్తా

Congress Will Win Majority MP Seats Says Revanth Reddy: రాజకీయం అయిపోయిందని.. ఇక పరిపాలపై దృష్టి సారిస్తానని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో తమ పార్టీకే అత్యధిక స్థానాలను ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో కీలక విషయాలపై స్పందించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 14, 2024, 10:43 PM IST
Revanth Reddy Chitchat: ఇక రాజకీయం ముగిసింది.. పరిపాలనపై దృష్టి సారిస్తా

Revanth Reddy: 'ఎన్నికలు ముగిశాయి. ఇక నా దృష్టి అంతా పరిపాలన పైనే. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 13 సీట్లు వస్తాయి' అని ని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎలా వ్యవహరించిందనే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. ఎవరి ఓట్లు వాళ్లు వాళ్లు తీసుకుంటే ఎన్నికలు అంచనా వేయవచ్చని తెలిపారు. కంటోన్మెంట్‌లో తమ విజయం ఖాయమని.. 20 వేల మెజారిటీతో గెలుస్తున్నట్లు విశ్వాసం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి మొత్తం 210 దాటేలా లేదని అంచనా వేశారు.

Also Read: KTR: అత్యధిక స్థానాలు మావే.. ఎంపీ ఎన్నికల్లో 'కారు'దే తిరుగులేని విజయం

 

'ఇక రాజకీయం ముగిసింది. నా దృష్టి పూర్తిగా పరిపాలనపై పెడుతా. విమర్శకులు ఏమనుకున్నా పట్టించుకోను. రేపటి నుంచి పరిపాలనపై పూర్తిగా దృష్టి సారిస్తాం. ధాన్యం కొనుగోలు రుణమాఫీపై దృష్టి పెడతాం. పాఠశాలల పునఃప్రారంభం అవుతుండడంతో వాటిపై ఫోకస్‌ పెడతాం. విద్య, వైద్యం, వ్యవసాయం పై దృష్టి పెట్టాం' అని వివరించారు. అసెంబ్లీలో చర్చ చేసి ఏదైనా నిర్ణయం తీసుకుంటాం.. లేదంటే అఖిలపక్షం పెడుతాం' అని తెలిపారు. రేషన్ దుకాణాలలో నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి పేదలకు పంచుతామని ప్రకటించారు. సామాన్యులు కొనుగోలు చేసే 9 వస్తువులు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇస్తామని పేర్కొన్నారు. రేషన్ షాప్‌లలో సన్న బియ్యం ఇస్తామని చెప్పారు.

Also Read: Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు రావు

 

'రైతలకు రుణమాఫీ కోసం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రుణం తీసుకుంటా. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రజలకు ఇస్తాం. రాష్ట్రానికి ఏం కావాలో వాటిని జాబితా తయారు చేసుకొని రైతుల నుంచి వచ్చేలా చూస్తా. విద్యుత్‌ విషయంలో కావాలనే కొందరు అధికారులు తప్పుడు విధానాలు చేస్తున్నారు' అని సంచలన ఆరోపణలు చేశారు.

'హరీష్ రావు ఒక మెకానిజం ఏర్పాటు చేశాడు. ఎన్నికల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూశారు. కొన్ని గుర్తించామని కేసులు కూడా కొన్ని నమోదయ్యాయి' అని తెలిపారు. 'ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తాం. రేపటి నుంచి సచివాలయానికి వెళ్తా. తడిసిన ధాన్యం విషయంలో వెంటనే చర్యలు తీసుంటాం. ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి. గోదావరి జలాలను హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు క్రమం తప్పకుండా వచ్చేలా చేస్తాం. ఒకే దగ్గర అన్ని ఫార్మా కంపెనీలు ఉండడంతో నగరం విడిచి వెళ్లాల్సి ఉండడంతో ఫార్మా సిటీలను విస్తరణ చేస్తాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌ మెట్రో విక్రయంపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మెట్రోను ఎల్ అండ్ టీ అమ్ముకుంటే అమ్ముకోనివ్వండి. మేము చేసేది ఏం ఉంటుంది. వాని ఆస్తి వాడు అమ్ముకుంటే చేసేది ఏం ఉంటుంది' అని చెప్పి విస్మయం కలిగించారు. 'మూసీపై కన్సల్టేన్సీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం. కేసీఆర్ మాదిరిగా మేధావి కాకపోవడంతో మేం కన్సల్టెన్సీపై ఆధారపడుతున్నాం. మూసీని ఒక ఆదాయ వనరుగా వాడుకుంటాం' అని వివరించారు.

హైదరాబాద్‌ కేంద్ర పాలిత ప్రాంతం వార్తలపై స్పందిస్తూ.. 'యూటీ అనేది స్టాప్ గ్యాప్ అది ముగిసిన అధ్యాయం. యూటీ అని ఎవరైనా ప్రచారం చేస్తే వాడంత తెలివి లేనివాడు ఇంకొకడు లేడు. వరంగల్‌ను హైదరాబాద్ దీటుగా అభివృద్ధి చేస్తాం. వరంగల్‌లో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేస్తాం' అని ప్రకటించారు.

ఏపీ ఫలితాలపై మాట్లాడుతూ.. 'ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా  వాళ్ళతో సఖ్యతగా ఉంటాం. అంతా సానుకూల ఆలోచనలే.. దుర్భద్ధి లేదు' అని పేర్కొన్నారు. వంద సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక అందించడమే తన లక్ష్యమని, మండలాలు, రెవెన్యూ డివిజన్‌లను క్రమబద్దికరణ చేయాలని చెప్పారు. జిల్లాల విభజనపై స్పందిస్తూ.. 'క్రమబద్ధీకరణ అనంతరం జిల్లాల ఏర్పాటు ఉంటుంది. కేసీఆర్ ఇష్టానుసారంగా జిల్లాలు ఏర్పాటు చేశారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌కి, ఒక్క నియోజకవర్గం ఉన్న వనపర్తిని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు' అని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా పాలమూరు జిల్లా ఇరిగేషన్ అధికారిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News