Revanth Fake Video: 'ఇప్పుడు రాలేను.. 4 వారాల టైం కావాలి' ఢిల్లీ పోలీసులకు రేవంత్‌

Revanth Reddy Reply To Delhi Police On Fake Video Row: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఫేక్‌ వీడియో కేసులో రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బిజీగా ఉన్నానని స్పష్టం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 1, 2024, 03:29 PM IST
Revanth Fake Video: 'ఇప్పుడు రాలేను.. 4 వారాల టైం కావాలి' ఢిల్లీ పోలీసులకు రేవంత్‌

Revanth Fake Video: లోక్‌సభ ఎన్నికల వేళ ఫేక్‌ వీడియో కలకలం రేపింది. చెప్పని మాటలు చెప్పినట్లు చేసి ఫేక్‌ వీడియో సృష్టించిన వివాదం తెలంగాణతోపాటు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య రాజకీ యుద్ధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఈ అంశంలో ప్రధాన సూత్రధారిగా భావించి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసు అందించారు. విచారణకు రావాలని ఆదేశించగా.. నేను ఇప్పుడు రాలేనంటూ రేవంత్‌ రెడ్డి సమాధానం ఇచ్చాడు.

Also Read: Narendra Modi: 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో దేశం గర్విస్తే.. 'ఆర్‌' ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడినట్లు ఒక ఫేక్‌ వీడియోను సోషల్‌ మీడియాలో ట్రెండయ్యింది. ఆ వీడియోను కాంగ్రెస్‌ పార్టీ చేయించిందనే ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ విషయంలో ఏప్రిల్‌ 29వ తేదీన ఢిల్లీ పోలీసులు హైదరాబాద్‌కు చేరుకుని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌కు చేరుకుని నోటీసులు ఇచ్చారు. మొత్తం ఐదుగురికి నోటీసులు ఇవ్వగా.. వారిలో రేవంత్‌ రెడ్డి పేరు కూడా ఉంది. మే 1వ తేదీన విచారణకు హాజరుకావాలని చెప్పగా రేవంత్‌ రెడ్డి హాజరుకాలేదు. నాలుగు వారాల గడువు అడిగారు.

Also Read: Light Beers: తాగుబోతుల పాలిట దేవుడయ్య నువ్వు.. లైట్‌ బీర్ల 'హీరో'కు ఘన సన్మానం

 

'ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాం. ఫేక్‌ వీడియోపై విచారణకు 4 వారాల గడువు ఇవ్వాలి. అప్పుడు విచారణకు హాజరవుతా' అని రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పోలీసులకు సందేశం ఇచ్చాడు. కాగా ఈ కేసుపై న్యాయపరంగా ముందుకువెళ్లే యోచనలో రేవంత్‌ ఉన్నాడు. తన న్యాయ నోటీసులు అందుకున్న వారిలో రేవంత్‌ రెడ్డితోపాటు కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ మన్నె సతీశ్‌, ఆ పార్టీ నాయకులు నవీన్‌, శివకుమార్‌, అస్మా తస్లీమ్‌ ఉన్నారు.

ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు టీపీసీసీ లీగల్‌ టీమ్‌ లేఖ రాసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో షేర్‌కు తనకు సంబంధం లేదని రేవంత్‌ ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపారు. ఐఎన్‌సీ తెలంగాణ ట్విటర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. తాను CMO తెలంగాణ, మరొకటి వ్యక్తిగత ఖాతా మాత్రమే వినియోగిస్తున్నట్టు పోలీసులకు పంపిన సమాధానంలో తెలిపారు. ఈ లేఖను ఢిల్లీ పోలీసులకు రేవంత్ తరఫున న్యాయవాది సౌమ్య గుప్త అందించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News