Poco M6 Pro 5G: 12జీబీ ర్యామ్ 50MP కెమేరాతో Poco M6 Pro స్మార్ట్‌ఫోన్ కేవలం 9 వేలకే

Poco M6 Pro 5G Offer Price: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చాలా కంపెనీల ఉత్పత్తులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో చైనాకు చెందిన పోకో కంపెనీ ఫోన్లకు క్రేజ్ పెరుగుతోంది. తక్కువ ధరలో అత్యధిక ఫీచర్లు కలిగిన ఫోన్లు లభిస్తుండటం ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు మరోసారి పోకో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 16, 2024, 10:59 AM IST
Poco M6 Pro 5G: 12జీబీ ర్యామ్ 50MP కెమేరాతో Poco M6 Pro స్మార్ట్‌ఫోన్ కేవలం 9 వేలకే

Poco M6 Pro 5G Offer Price: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Poco కొత్తగా Poco M6 Pro 5G లాంచ్ చేసింది. ఇందులో ఒకదాన్ని మించి మరొకటిగా ఫీచర్లు ఉన్నాయి. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు కెమేరా, ర్యామ్ అన్నీ ప్రీమియం ఫోన్లకు దీటుగా ఉన్నాయి. అలాగని ధర మాత్రం ఎక్కువ కాదు. అందుకే ఆకట్టుకుంటోంది. 

Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ ఉంటుంది. 22.5 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బ్యాటరీ అయితే 5000 ఎంఏహెచ్ ఉంటుంది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 4జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10.999 రూపాయలకు లాంచ్ కాగా ఇప్పుడు కేవలం 8 వేలకే అందుబాటులో ఉంది. ఇందులోనే 12 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగిన పోన్ ఇప్పుడు కేవలం 8,999 రూపాయలకే లభించనుంది. కేవలం 9 వేలకే 12జీబీ ర్యామ్ కలిగిన ఫోన్ లభించడం బహుశా ఇదే కావచ్చు. 

ఇందులో డ్యూయల్ కెమేరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. అమెజాన్‌లో పోకో ఫోన్ విక్రయాలు అందుబాటులో ఉన్నాయి. అద్భుత ఫీచర్లు కలిగి ఉండి బడ్జెట్ ఫోన్ కావడం వల్ల పోకో ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. 

Also read: TVS iQube: అద్భుత మైలేజ్, అతి తక్కువ ధరతో TVS నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు ధర ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News