Yusuf Pathan Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్, అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు

Yusuf Pathan Retirement From All Formats Of The Cricket: 38 ఏళ్ల సీనియర్ పఠాన్. క్రికెట్‌లో అడుగుపెట్టిన తొలిరోజుల్లోనే వన్డే, టీ20 ప్రపంచ కప్‌లలో ప్రాతినిథ్యం వహించాడు. టీమిండియా క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 26, 2021, 05:35 PM IST
  • టీమిండియా క్రికెటర్ యూసఫ్ పఠాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు
  • క్రికెట్‌లో అడుగుపెట్టిన తొలిరోజుల్లోనే వన్డే, టీ20 ప్రపంచ కప్‌లలో ప్రాతినిథ్యం వహించాడు
  • తాజాగా ఆటకు అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు
Yusuf Pathan Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్, అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు

Yusuf Pathan Retirement From All Formats Of The Cricket: టీమిండియా క్రికెటర్ యూసఫ్ పఠాన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు తన వీడ్కోలుపై ప్రకటన విడుదల చేశాడు 38 ఏళ్ల సీనియర్ పఠాన్. క్రికెట్‌లో అడుగుపెట్టిన తొలిరోజుల్లోనే వన్డే, టీ20 ప్రపంచ కప్‌లలో ప్రాతినిథ్యం వహించాడు. తాజాగా ఆటకు అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

భారత్ తరఫున 57 వన్డేలలో ప్రాతినిథ్యం వహించిన యూసఫ్ పఠాన్(Yusuf Pathan) రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 810 పరుగులు చేశాడు. 33 వికెట్లు తీశాడు. టీమిండియాకు 22 టీ20 మ్యాచ్‌లు ఆడిన యూసఫ్ పఠాన్  236 పరుగులు చేయడంతో పాటు 13 వికెట్లు తీశాడు. తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ తరువాత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తీవ్రమైన పోటీ కారణంగా, ఫామ్ లేమితో చోటు కోల్పోయాడు

Alos Read: Ind vs Eng 3rd Test Highlights: నరేంద్ర మోదీ స్టేడియంలో రికార్డుల మోత మోగించిన Virat Kohli సేన

కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్న టీమిండియా(Team India) క్రికెటర్ యూసఫ్.. రిటైర్మెంట్ ప్రకటన విడుదల చేశాడు. తనకు మద్దతు తెలిపన కుటుంబసభ్యులు, స్నేహితులు, అభిమానులు, జట్టు, కోచ్‌లు సహా దేశం మొత్తానికి ధన్యవాదాలు తెలిపాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు.

Also Read: R Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు

ఐపీఎల్‌ మూడో సీజన్‌(IPL 2010)లో రాజస్థాన్ రాయల్స్‌కి వైస్ కెప్టెన్‌గా యూసఫ్ పఠాన్ వ్యవహారించాడు. కేవలం 37 బంతుల్లోనే శతకం బాది ఐపీఎల్‌లో రికార్డులు తిరగరాశాడు. తన సోదరుడు ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.  
 

జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సోదరులలో యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఎప్పటకీ గుర్తుండిపోతారు. ప్రస్తుతం దీపక్ చహర్, రాహల్ చహర్, హార్ధిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా సోదరులు జాతీయ జట్టుకు ఆడేందుకు యత్నిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News