FIFA WC 2022: అద్భుత విజయానికి ఊహించని నజరానా, సౌదీ ఆటగాళ్లకు రోల్స్ రాయిస్ కార్లు

FIFA WC 2022: ఫిఫా ప్రపంచకప్‌లో నిజంగానే ఓ అద్భుతం జరిగింది. టోర్నీ ఫేవరెట్, సాకర్ కింగ్ అర్జెంటీనాను సౌదీ అరేబియా మట్టికరిపించింది. అంతే ఇంకేముంది..ఆ దేశపు రాజు ఖుష్ ఖుష్ అయ్యారు. ఊహించని అత్యంత విలువైన బహుమతి ప్రకటించారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 26, 2022, 06:11 PM IST
FIFA WC 2022: అద్భుత విజయానికి ఊహించని నజరానా, సౌదీ ఆటగాళ్లకు రోల్స్ రాయిస్ కార్లు

FIFA WC-2022 టైటిల్ ఫేవరేట్ అర్జెంటీనాకు షాక్ తగిలింది. ఆ దేశంపై సౌదీ అరేబియా జట్టు ఘన విజయం సాధించి సంచలనం నమోదు చేసింది. ఫలితంగా ఆ దేశపు రాజు ఆ జట్టు సభ్యులే కాదు ఎవరూ కలలో కూడా ఊహించని విలువైన బహుమతి ప్రకటించారు. ఆ వివరాలు మీ కోసం..

ఖతార్ వేదికగా ఫిఫా ప్రపంచకప్ 2022 జరుగుతోంది. ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా బరిలో దిగిన సాకర్ కింగ్ అర్జెంటీనాకు సౌదీ అరేబియా జట్టు గట్టి షాక్ ఇచ్చింది. టోర్నీ ఫేవరేట్ అర్జెంటీనాను సౌదీ అరేబియా 2-1 తేడాతో ఓడించింది. సాకర్ చరిత్రలో నిజంగానే ఇదొక సంచలనం. ఒక పెద్ద జట్టుపై విజయం సాధించడంతో..సౌదీ అరేబియా ఓ పెద్ద సంబరంగా జరుపుకునేందుకు ఒకరోజు అధికారిక సెలవు ప్రకటించేసింది.

అర్జెంటీనా వంటి పటిష్టమైన జట్టును ఓడించి..రౌండ్ ఆఫ్ 16 అవకాశాల్ని సులభతరం చేసుకన్న సౌదీ అరేబియా ఫుట్‌బాల్ జట్టుకు ఆ దేశపు రాజు భారీ నజరానా ప్రకటించారు. అర్జెంటీనాపై గెలిస్తే ఒక్కొక్క సౌదీ ఆటగాడికి ఖరీదైన రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అర్జెంటీనాపై గెలిస్తే రోల్స్ రాయిస్ కారు బహుమతిగా ఇస్తానని ముందుగానే మాటిచ్చారు సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్. ఈ కారు ఖరీదు భారత కరెన్సీ ప్రకారం ఒక్కొక్కటి 5 కోట్లుపైనే ఉంటుంది. సౌదీ అరేబియా జట్టుకు ఇలాంటి బహుమతులు కొత్తేమీ కాదు. గతంలో 1994 ప్రపంచకప్‌లో బెల్జియం జట్టును 1-0తో ఓడించినప్పుడు కూడా సౌదీ కీలక ఆటగాడు సయీద్ అల్ ఒవైరన్‌కు అత్యంత ఖరీదైన లగ్జరీ కారు అందించారు. 

వాస్తవానికి తొలి అర్ధభాగంలో 0-1తో వెనుకబడిన సౌదీ అరేబియా జట్టు..రెండవ హాఫ్‌లో పుంజుకుని వరుసగా రెండు గోల్స్ చేయడంతో మ్యాచ్ గెలిచింది. 36 మ్యాచ్‌లలో ఓటమి లేకుండా సాగుతున్న అర్జెంటీనాకు బ్రేక్ పడింది. ఇవాళ అంటే నవంబర్ 26న పోలండ్ జట్టును ఎదుర్కోనుంది. ఇందులో కూడా గెలిస్తే..రౌండ్ ఆఫ్ 16కు సౌదీ అర్హత సాధిస్తుంది.

Also read: IND Playing XI vs NZ: శార్దూల్, చహల్ ఔట్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో ఆడే భారత తుది జట్టు ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News