Lionel Messi: మెస్సీకి అరుదైన గౌరవం.. ఇకపై 10 నంబ‌ర్ జెర్సీకు సెలవు..

Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోన‌ల్ మెస్సీ హిస్టరీ క్రియేట్ చేశాడు. దిగ్గజ ప్లేయర్ మారడోనాకు దక్కని గుర్తింపు మెస్సీకి దక్కింది. గత ఫిపా వరల్డ్ కప్ లో అర్జెంటీనాను విజేతగా నిలిపాడు మెస్సీ.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2024, 04:22 PM IST
Lionel Messi: మెస్సీకి అరుదైన గౌరవం.. ఇకపై 10 నంబ‌ర్ జెర్సీకు సెలవు..

Lionel Messi's No.10 Argentina jersey set to be retired: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోన‌ల్ మెస్సీ(Lionel Messi)కి అరుదైన గౌరవంం దక్కింది. మెస్సీ ధ‌రించే 10వ నంబ‌ర్ జెర్సీకి శాశ్వ‌తంగా వీడ్కోలు ప‌ల‌కాల‌ని అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం(AFA) నిర్ణ‌యించింది. .ఈ విష‌యాన్ని సోమ‌వారం ఏఎఫ్ఏ అధ్య‌క్షుడు క్లాడియో త‌పియా(Claudio Tapia) వెల్ల‌డించాడు. క్లాడియో త‌పియా మాట్లాడుతూ.. '' పుట్ బాల్ కెరీర్ కు మెస్సీ వీడ్కోలు పలికితే.. అతడి గౌర‌వార్థంగా 10వ నంబ‌ర్ జెర్సీకి వీడ్కోలు ప‌లుకుతాం. మెస్సీకి మేము చేయగలిగింది ఏమైనా ఉంటే అదేనని'' ఆయన తెలిపారు. 

లెజెండ‌రీ ఆటగాడు డిగో మార‌డోనా(Diego Maradona)కు ‘ఇలాంటి గుర్తింపు ద్కకపోవడం విశేషం. అత‌డు వీడ్కోలు ప‌లికిన తర్వాత ఆ జెర్సీని కూడా ఎవ‌రికీ కేటాయించొద్ద‌ని అర్జెంటీనా భావించింది. కానీ, అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ స‌మాఖ్య అర్జెంటీనా ప్ర‌తిపాద‌న‌ను అంగీకరించలేదు. నిరుడు ఖ‌తార్‌లో జ‌రిగిన ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అర్జెంటీనాను విజేతగా నిలిపాడు మెస్సీ. ఈ క్రమంలో ఏఎఫ్ఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఫిపా తర్వాత మెస్సీ పీఎస్‌జీ క్ల‌బ్‌ను వదిలి ఇంట‌ర్ మియామి(Inter Miami)తో ఒప్పందం చేసుకున్నాడు. మేజ‌ర్ సాక‌ర్ లీగ్‌లో తన అద్భుతమైన ఆటతీరుతో మియామి క్ల‌బ్‌ను విజేత‌గా నిలిపాడు. అంతేకాదు ప్రతిష్ఠాత్మక 'ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్‌ ది ఇయర్ 2023' అవార్డు కోసం భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)తో పోటీపడ్డాడు. చివరకు కోహ్లీనే విజేతగా నిలిచాడు. ప్యుబిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న పేజీల్లో ఒకటి.  దీని అనుబంధ సంస్థ ప్యూబిటీ స్పోర్ట్ ఈ అవార్డును అందిస్తోంది.

Also Read: David Warner: న్యూఇయర్ రోజు షాకిచ్చిన ఆసీస్ స్టార్ ఓపెనర్.. వ‌న్డేల‌కు వార్నర్ గుడ్ బై..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News