సెల్యూట్ జవాన్స్.. హ్యాపీ దీపావళి

    

Last Updated : Oct 19, 2017, 07:45 PM IST
సెల్యూట్ జవాన్స్.. హ్యాపీ దీపావళి

భారతీయ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ ఈ రోజు దీపావళి పండుగను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు.  సరాసరి బరోడా ఎయిర్ పోర్టుకి వెళ్ళి అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ జవాన్లను కలిసి వారికి దీపావళి శుభాకాంక్షలు  తెలిపారు. అంతే కాదు.. వారికి మిఠాయిలు పంచి పెట్టి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు.  ఆ తర్వాత వారితో ఫోటోలు దిగి వాటిని ట్విటర్‌లో పోస్టు చేశారు. పండుగ పూట కూడా విధులకు హాజరవుతున్న జవాన్లకు నా సెల్యూట్ అని కూడా ట్వీ్ట్ చేశారు.

యూసుఫ్  అభిమానులు అతను చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ, తమ అభిమాన క్రికెటర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే చాలామంది నెటిజన్లు యూసుఫ్‌ చేసిన పనిని అభినందిస్తూ రీట్వీట్‌ చేశారు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బరోడా టీమ్ తరఫున ఆడుతున్న యూసుఫ్ పఠాన్ ఈ సీజన్‌లో రెండు సెంచరీలు కూడా చేశారు. ఈ ట్రోఫీలో యూసుఫ్ తన సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్సీలో ఆడడం గమనార్హం. 

 

Trending News