DC Vs MI Match Highlights: ఇవేం షాట్లు బాబోయ్.. మేము ఎక్కడా సుడలే.. స్టబ్స్ పిచ్చెక్కించే బ్యాటింగ్

DC Vs MI Scorecard: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటిల్స్ బ్యాట్స్‌మెన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. 20 ఓవర్లలో 257 పరుగులు చేసి ముంబైకి భారీ టార్గెట్ విధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ట్రిస్టన్ స్టబ్స్ విచిత్ర షాట్లతో అలరించాడు. 

Written by - Ashok Krindinti | Last Updated : Apr 27, 2024, 06:53 PM IST
DC Vs MI Match Highlights: ఇవేం షాట్లు బాబోయ్.. మేము ఎక్కడా సుడలే.. స్టబ్స్ పిచ్చెక్కించే బ్యాటింగ్

DC Vs MI Scorecard: ఈ ఐపీఎల్ సీజన్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. సిక్సర్లు, ఫోర్లు బౌండరీలతో బ్యాట్స్‌మెన్లు స్టేడియాలను హోరెత్తిస్తున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటిల్స్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఆరంభంలో చెలరేగి ఆడగా (84).. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (48 నాటౌట్) అదిరిపోయే ముగింపు ఇచ్చాడు. 258 పరుగుల లక్ష్యంతో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగింది.

Also Read: KTR AP Elections: ఏపీ ఎన్నికలపై కేటీఆర్‌ జోష్యం.. మళ్లీ ఆయనే గెలవాలంటూ వ్యాఖ్యలు

ఇక ఈ మ్యాచ్‌లో స్టబ్స్ ఆడిన రెండు షాట్లు హైలెట్ అని చెప్పొచ్చు. వికెట్లకు అడ్డంగా నిలబడి.. థర్డ్ మ్యాన్‌ దిశగా దిమ్మతిరిగే రీతిలో వరుసగా రెండు షాట్లు ఆడాడు. వుడ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో స్టబ్స్ తన బ్యాటింగ్ విన్యాసాలతో అలరించాడు. ఈ ఓవర్‌లో వరుసగా 4, 4, 6, 4, 4, 4 బాది ఆరు బంతుల్లో 26 పరుగులు పిండుకున్నాడు. మూడు, నాలుగు బంతులను వికెట్లకు మధ్యలో నిలబడి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తిరిగి సూపర్ షాట్లు ఆడాడు. రెండు షాట్లు కూడా ఒకే తరహాలో ఆడిన స్టబ్స్.. సిక్స్, ఫోర్‌గా మలిచాడు.

 

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 27 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ (36)తో కలిసి తొలి వికెట్‌కు 7.3 ఓవర్లలోనే 114 పరుగులు జోడించి బలమైన పునాది వేశాడు. మెక్‌గుర్క్ 15 బంతల్లోనే హాఫ్ సెంచరీ బాది.. ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ అర్ధ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆ తరువాత షై హోప్ (17 బంతుల్లో 41, 5 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు భారీ షాట్లు ఆడాడు. 

కెప్టెన్ రిషబ్ పంత్ (19 బంతుల్లో 29, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కాసేపు క్రీజ్‌లో అలరించాడు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ మాత్రం ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి ఢిల్లీ స్కోరు 257 పరుగులకు చేర్చాడు. అక్షర్ పటేల్ (6 బంతుల్లో 11, ఒక సిక్సర్) నాటౌట్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లా, ల్యూక్ వుడ్, బూమ్రా, నబీ చెరో వికెట్ పడగొట్టారు. 

Also Read: Insta Reels Viral: ఎవడ్రా నన్ను ఆపేది.. ట్రాఫిక్‌ ఆపి రోడ్డుపై కుర్చీ వేసుకుని ఇన్‌స్టా రీల్స్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Trending News