IPL 2024: ముంబై ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. ఫిటినెస్ టెస్టులో ఫెయిల్ అయిన టీ20కా బాప్.. తొలి మ్యాచ్ కు దూరం..

IPL 2024: ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు. కారణం ఏంటంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2024, 08:45 PM IST
IPL 2024: ముంబై ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. ఫిటినెస్ టెస్టులో ఫెయిల్ అయిన టీ20కా బాప్.. తొలి మ్యాచ్ కు దూరం..

IPL 2024-Surya Kumar Yadav: ఐపీఎల్ మెుదలుకాకముందే ముంబై ఇండియన్స్ అభిమానులకు గుండె పగిలే వార్త. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు. హార్దిక్ సేన తన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొనబోతుంది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ఐపీఎల్ లో ఆడేందుకు సూర్యకుమార్ యాదవ్ కు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో మార్చి 24న జరగబోయే మ్యాచ్ నుంచి ఔట్ అయ్యాడు. 

గత ఏడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో సూర్య చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు. తరువాత ఈ స్టార్ బ్యాటర్‌కు స్పోర్ట్స్ హెర్నియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాంతో అతడు సర్జరీ చేయించుకున్నాడు. ఫిటినెస్ నిరూపించుకోవాలని కొన్ని వారాలుగా ఎన్సీఏలో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ చేయించుకున్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్‌ను నిలిపివేయాలని వైద్యులు మరియు ఫిజియోల బృందం నిర్ణయించింది.

దీంతో తీవ్ర నిరాశ చెందిన సూర్య హార్ట్ బ్రోక్ ఎమోజీని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. మళ్లీ సూర్య మార్చి 21న ఫిటినెస్ టెస్టు చేయించుకోబోతున్నాడు. ఇందులో పాస్ అయితే మార్చి 27న జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో సూర్య పాల్గొంటాడు. ముంబై టీమ్.. ఏప్రిల్ 1న రాజస్థాన్ రాయల్స్,  ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. 33 ఏళ్ల సూర్య 124 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో 3249 పరుగులు చేశాడు. 

Also read: IPL 2024 Updates: మూడు రోజుల్లో ఐపీఎల్.. ఇంతలో ముంబైకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం..

Also Read: IPL 2024, CSK vs RCB: 'ప్లీజ్.. నా పిల్ల‌లకు ఐపీఎల్ టికెట్లు ఇప్పించండి'.. సీఎస్కేను కోరిన టీమిండియా స్టార్ బౌలర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News