Vaishakh Amavasya 2024: వైశాఖ అమావాస్య మే 8 తేదీనా లేదా 9 తేదీనా? ఇక్కడ ఖచ్చితమైన తేదీ, ప్రాముఖ్యతను తెలుసుకోండి..

Hindu Festivals 2024: హిందూమతంలో అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. హిందువులు అమావాస్యను చెడుగా భావిస్తారు. ప్రస్తుతం నడుస్తున్న వైశాఖ మాసంలో త్వరలో అమావాస్య రాబోతుంది. దీని యెుక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Last Updated : May 1, 2024, 08:05 PM IST
Vaishakh Amavasya 2024: వైశాఖ అమావాస్య మే 8 తేదీనా లేదా 9 తేదీనా? ఇక్కడ ఖచ్చితమైన తేదీ, ప్రాముఖ్యతను తెలుసుకోండి..

Vaishakh Amavasya 2024 Date and Significance: సాధారణంగా హిందువులు అమావాస్యను అశుభకరమైనదిగా భావిస్తారు. ఆ రోజు బయటకు వెళ్లకూడదని, ఏ కార్యం చేయకూడదని అంటుంటారు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈదినం కొన్ని పనులకు శుభకరమైనదిగా చెబుతారు.  పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తర్పణం, పిండదానం, శ్రాద్ధం అమావాస్య రోజునే చేస్తారు.అంతేకాకుండా స్నాన, దానానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్ర కర్మలు చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది. 

వైశాఖ అమావాస్య తేదీ, శుభ ముహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రస్తుతం వైశాఖ మాసం నడుస్తోంది. ఈ మాసంలో వచ్చే అమావాస్యనే వైశాఖ అమావాస్య అని పిలుస్తారు. ఇది మే 07వ తేదీ ఉదయం 11.41 గంటలకు ప్రారంభం కానుంది. మరుసటి రోజు ఉదయం 8:51 గంటలకు ముగుస్తుంది. అంటే ఈ అమావాస్యను మే 7 మరియు 8 రెండు తేదీల్లో జరుపుకోవచ్చు. అయితే ఉదయం తిథి కారణంగా చాలా ప్రాంతాల్లో ఈ అమావాస్యను మే 08 తేదీన జరుపుకోనున్నారు. 

Also Read: Surya Gochar 2024: మే నెలలో ఈ 3 రాశులకు మంచి రోజులు.. ఇందులో మీ రాశి ఉందా?

అమవాస్య రోజు ఇలా చేస్తే మీకే మంచిది
పురాణాల ప్రకారం వైశాఖ అమావాస్య రోజున శ్రీమహావిష్ణువును పూజించే సంప్రదాయం కూడా ఉంది. ఈరోజు శ్రీహరిని పూజించడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇదే రోజు రావిచెట్టుకు నీరు పోయడం కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది, ఎందుకంటే ఆ వృక్షంలో విష్ణువు మరియు పితృదేవతలు నివసిస్తారని నమ్ముతారు. మీ పూర్వీకులను ప్రసన్న చేసుకోవాలన్నా, మీ జాతకంలో పితృదోషం తొలగిపోవాలన్నా ఈరోజున పితృ చాలీసా పాటించడం శుభప్రదంగా భావిస్తారు. 

Also Read: Guru Transit 1 May 2024: 2025 వరకు ఈ రాశులవారికి లాభాలే లాభాలు.. ఇక తిరుగు లేదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News