Scary Viral Video: షాకింగ్ వీడియో.. పోస్ట్‌మార్టం రూమ్‌‌లో ఆటోమేటిక్‌గా కదిలిన నిచ్చెన.. దెయ్యం ఉందా..?

Ladder Walking Video Viral: నిచ్చెన నడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పోస్ట్‌మార్టం రూమ్‌లో నిచ్చెన దానంతట అదే నడవడం భయాందోళనకు గురిచేస్తోంది. అయితే దీని వెనుక సైన్స్ ఉందంటూ నిపుణులు చెబుతున్నారు.     

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 4, 2023, 09:22 AM IST
Scary Viral Video: షాకింగ్ వీడియో.. పోస్ట్‌మార్టం రూమ్‌‌లో ఆటోమేటిక్‌గా కదిలిన నిచ్చెన.. దెయ్యం ఉందా..?

Ladder Walking Video Viral: ప్రస్తుతం కాస్త డిఫరెంట్‌గా చిన్న విషయం జరిగినా నెట్టింట వైరల్ అవుతుంటుంది. ప్రపంచంలో ఏ మూల జరిగినా క్షణాల్లో మన మొబైల్‌లో ప్రత్యక్షం అవుతుంది. తాజాగా ఓ ఆశ్చర్యకర వీడియో తెరపైకి వచ్చింది. వస్తువులు ఎవరి ప్రమేయం లేకుండా వాటంతట అవే గాల్లో ఎగరడం.. అటు ఇటు కదలడం సినిమాల్లోనే చూసుంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ చెక్క నిచ్చెన దానంతటే అదే అడుగులు వేసుకుంటూ ముందుకు కదులుతోంది. అది కూడా హాస్పిటల్ పోస్ట్ మార్టంలో ఉంచిన నిచ్చెన కావడంతో ఏదైనా శక్తి కదిలిస్తుందేమో అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఒక వెదురు నిచ్చెన దానంతట అదే కదులుతున్న వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని ఎస్ఆర్ఎమ్‌ఎస్‌ మెడికల్ కాలేజీకి చెందిన పోస్ట్‌మార్టం రూమ్‌కు సంబంధించినదంటూ ఓ నెటిజన్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు చెక్క నిచ్చెన మనుషుల్లా నెమ్మదిగా నడుస్తోంది. ఈ 'వాకింగ్ నిచ్చెన' ఈ ఫుటేజ్ ప్రజలను భయపెడుతోంది. చాలా మంది దెయ్యమే నిచ్చెనను నడిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఆ నిచ్చెన అలా నడుస్తునే ముందుకు పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ఈ వీడియోను అరవింద్ చోటియా గతంలో ట్విట్టర్‌లో షేర్ చేశాడు. బరేలీలోని ఎస్‌ఆర్‌ఎంఎస్ మెడికల్ కాలేజీలోని పోస్ట్‌మార్టం భవనంలో నాలుగు కాళ్లతో నడుస్తున్న నిచ్చెన అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ క్లిప్‌ను కొందరు నెటిజన్లు ఫేక్ అంటూ కొట్టిపారేస్తున్నారు. బరేలీ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌తో మాట్లాడాడని.. ఇది కాలేజీ వీడియో కాదని అంటున్నారు. అసలు బరేలీలో అలాంటి సంఘటన జరగలేదని స్పష్టం చేస్తున్నారు. 

 

అయితే నిచ్చెన ఇలా నడవడం వెనుక సైన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. జడత్వ చలనం అనే ఒక దృగ్విషయంపై పనిచేసే న్యూటన్ నియమం గురించి వివరిస్తున్నారు. బాహ్య శక్తి జోక్యం చేసుకోని పక్షంలో.. వంపు తిరిగిన ఉపరితలంపై ఉన్న వస్తువు జడత్వం కారణంగా దాని అంతటే కదులుతుందని న్యూటన్ నియమం చెబుతోంది. ఒక వస్తువును ఏటవాలు ఉపరితలంపై కొద్దిగా నెట్టివేసినప్పుడు.. ఎక్కువ పుష్‌లు అవసరం లేకుండా అది తనంతట తానుగా కదులుతూ ఉంటుంది. ఇది న్యూటన్  జడత్వం చట్టం కారణంగా జరుగుతుంది. నిష్క్రియాత్మక డైనమిక్ వాకింగ్ అనేది సమర్థవంతమైన.. సహజమైన రెండు-కాళ్ల వాకింగ్ రోబోల రూపకల్పనకు ఒక భావన. ఈ అంశంపై పరిశోధనకు నిష్క్రమణ ప్రారంభ స్థానం అవసరం. 

Also Read: PM Kisan Latest Updates: పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఈ మూడు పనులు కచ్చితంగా చేయండి   

 Also Read: Best Breakfast Foods: మీ శరీరంలో ఇమ్యూనిటీని వేగంగా పెంచే 6 అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News