Yashasvi Jaiswal: ఇలాగైతే కష్టమేనయ్యా..! టీ20 వరల్డ్ కప్‌ ముందు జైస్వాల్ బ్యాటింగ్ దారుణం

Yashasvi Jaiswal in IPL 2024: టీ20 వరల్డ్ కప్‌కు ముందు జరుగుతున్న ఐపీఎల్‌లో కుర్రాళ్లు అదరగొడుతున్నారు. ఇక్కడ సత్తాచాటితే.. నేరుగా ప్రపంచకప్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉండడంతో యంగ్ ఆటగాళ్లు తమ ప్రతిభకు పదునుపెడుతున్నారు. అయితే ఇప్పటికే టెస్టులు, టీ20ల్లో ఓపెనర్‌గా దాదాపు ప్లేస్ ఫిక్స్ చేసుకున్న యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ఈ ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతున్నాడు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

1 /5

రోహిత్ శర్మతో కలిసి యశస్వి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఓ రెండ్‌లో హిట్ మ్యాన్ స్ట్రైకింగ్ ఇస్తే దూకుడుగా ఆడటం యశస్వి ప్రత్యేకత. ఈ ఐపీఎల్‌లో జైస్వాల్ వరుసగా విఫలమవ్వడం కలవరపరుస్తోంది.   

2 /5

ఈ సీజన్‌లో రాజస్థాన్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి టాప్ ప్లేస్‌లో ఉంది. అయితే జైస్వాల్ ప్రదర్శన మాత్రం చాలా దారుణంగా ఉంది. 5 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 24, 5, 10, 0, 24 పరుగులు మాత్రమే చేశాడు. అంటే మొత్తం 63 పరుగులు మాత్రమే చేశాడు.  

3 /5

త్వరలోనే టీ20 వరల్డ్ కప్ టీమ్ ఎంపిక జరగనుంది. ఐపీఎల్‌లో సత్తాచాటిన ఆటగాళ్లను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.   

4 /5

రోహిత్‌కు తోడుగా ఓపెనింగ్‌లో తీవ్ర పోటీ నెలకొంది. శుభ్‌మన్ గిల్ ఇప్పటికే రేసులో ఉండగా.. కేఎల్ రాహుల్ కూడా ఓపెనింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. రిషబ్ పంత్ రీఎంట్రీ ఖాయకావడంతో రాహుల్ ఓపెనర్‌గా మారే అవకాశం ఉంది.   

5 /5

గత సీజన్‌లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ఉన్న యశస్వి జైస్వాల్.. ఐపీఎల్‌లో దుమ్ములేపడంతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్‌లో ఏకంగా 600 పరుగులు చేశాడు ఈ యంగ్ బ్యాట్స్‌మెన్. టీ20 వరల్డ్ కప్‌ ముందుకు జైస్వాల్ ఫామ్‌లోకి రావాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.