IPL 2024 Updates: కప్ కొట్టాలనే కసితో ఆర్‌సీబీ.. కొత్త స్క్వాడ్ ఇదే..!

Royal Challengers Bangalore Team Squad: ఐపీఎల్ ఆరంభానికి మూహుర్తం దగ్గరపడుతోంది. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్‌లో ప్రాక్టీస్ ముమ్మరం చేశారు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ ప్రారంభంకానుంది. ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. ఒక్కసారైనా కప్ కొట్టాలనే కసితో ఆర్‌సీబీ రెడీ అవుతోంది.
 

Royal Challengers Bangalore Team Squad: ఈ ఆర్‌సీబీ భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. డుప్లెసిస్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కొత్త కుర్రాళ్లను జట్టులోకి చేర్చుకుని రంగం సిద్ధం చేసుకుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కాస్త విరామం తరువాత ఐపీఎల్‌లో నేరుగా ఆడనున్నాడు. ఐపీఎల్ ఆరంభానికి ఆర్‌సీబీ పూర్తి స్క్వాడ్ ఇలా..
 

1 /5

స్టార్ పేసర్ హర్షల్ పటేల్‌ను వేలానికి ముందు జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తీసుకుంది. ఈ సీజన్‌కు ముందు రిలీజ్ చేయగా.. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్‌ను  రూ.11.50 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది.

2 /5

మరో ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్‌ను రూ.రూ.5 కోట్లు వెచ్చించి వేలంలో తీసుకుంది. కివీస్ స్పీడ్ స్టార్ లోకీ ఫెర్గూసన్‌కు రూ.2 కోట్లు ఖర్చు చేసింది. టామ్ కుర్రాన్, సౌరవ్ చౌహాన్, స్వప్నిల్ సింగ్ తదితర ఆటగాళ్లను జట్టులో చేర్చుకుంది.   

3 /5

విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్‌, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్‌తో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను జట్టుతో చేరడంతో మరింత బలంగా మారింది. మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లే, ఆకాశ్‌దీప్ సింగ్, కర్ణ్ శర్మ బౌలింగ్‌లో విభాగంలో ఉన్నారు.  

4 /5

ఐపీఎల్ ప్రారంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేదు. రెండుసార్లు ఫైనల్‌కు చేరుకోగా.. ఒకసారి డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది.   

5 /5

ఆర్‌సీబీ టీమ్: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, సౌరవ్ చౌహాన్, దినేష్ కార్తీక్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, ఆకాష్ దీప్, మనోజ్ భాండాగే, టామ్ కర్రాన్, కామెరూన్ గ్రీన్, విల్ జాక్వెస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, మయాంక్ డాగర్, ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ సిరాజ్, రాజన్ కుమార్, హిమాన్షు శర్మ, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, రీస్ టోప్లీ, విజయ్‌కుమార్ వైషాక్, యష్ దయాల్.