Passport: పాస్‌పోర్ట్ ఎలా అప్లై చేయాలి..కేవలం గంటలోనే..

  • Dec 13, 2020, 16:24 PM IST

 

Passport: మీరు పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారా..ఇంతకుముందులా కాదిప్పుడు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని..సంబంధిత పోస్టోఫీసుకు వెళ్లి సంబంధిత పత్రాల్ని సమర్పించాలి. కేవలం 15 రోజుల్లోపే మీ ఇంటికి వస్తుంది. ఎలాగో తెలుసుకోండి…

1 /6

కేవలం పదిహేను రోజుల్లోపలే పాస్‌పోర్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది. రెన్యువల్‌కు కూడా ఇదే ప్రక్రియ.

2 /6

పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటరు ఐడీ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతల జిరాక్స్ కాపీల్ని సమర్పిస్తూ..ఒరిజినల్స్ మాత్రం చూపించాలి. 

3 /6

పుట్టిన తేదీ ధృవీకరణ కోసం పదవ తరగతి మార్క్స్ లిస్ట్ లేదా సంబంధిత శాఖ నుంచి ధృవీకరణ పత్రం సమర్పించాలి. 

4 /6

అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు లేదా గ్యాస్ కనెక్షన్ ప్రూఫ్ లేదా టెలిఫోన్ బిల్ లేదా వాటర్ బిల్ లేదా రెంటల్ అగ్రిమెంట్ ఏదైనా సమర్పించవచ్చు. 

5 /6

తరువాత స్లాట్ బుక్ అయిన తేదీ, సమయానికి మీ సమీపంలోని పాస్‌పోర్ట్ ఆఫీసు లేదా పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన పాస్‌పోర్ట్ కేంద్రానికి వెళ్లి..సంబంధిత పత్రాలు సమర్పించాలి. ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. మీరు బుక్ చేసుకున్న టైమ్ నుంచి గంటలో  ఈ ప్రక్రియ పూర్తయిపోతుంది.

6 /6

ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవల్సి ఉంటుంది. మొబైల్ నుంచి లేదా ఏదైనా నెట్ సెంటర్‌కు వెళ్లి సింపుల్‌గా బుక్ చేసుకోవచ్చు.