Alluri Seetharamaraju@50Years: 50 యేళ్ల అల్లూరి సీతారామరాజు.. తెర వెనక ఆసక్తికర కథ ఇదే..

Alluri Seetharamaraju@50Years: దివంగత సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో 350 పైగా చిత్రాల్లో నటించారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో అల్లూరి సీతారామరాజు మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒక రకంగా తెలుగు తెరకు అల్లూరి సీతారామరాజు అంటే సూపర్ స్టార్ కృష్ణనే గుర్తుకు వస్తారు. ఈ సినిమా విడుదలై 50 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా Zee తెలుగు ప్రత్యేక కథనం..

1 /9

అల్లూరి సీతారామరాజు సినిమాను ఎన్టీఆర్ చేయాలని ఎన్నో ఏళ్లుగా అనుకున్నారు. కానీ సడెన్‌గా సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా చేసారు. అయినా.. ఆ పాత్రపై ఇంట్రెస్ట్ తగ్గలేదు. అల్లూరి పై సినిమా చేయలేకపోయినా.. సర్ధార్ పాపారాయుడు, మేజర్ చంద్రకాంత్ సినిమాల్లో ఓ పాటలో భాగంగా అల్లూరి సీతారామరాజు గెటప్ వేసి ఆ పాత్రపై తన మక్కువను చాటుకున్నారు అన్నగారు. ముందుగా శోభన్ బాబు హీరోగా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేయించారు. కానీ ఫైనల్‌గా కృష్ణ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది.

2 /9

ఈ సినిమాను అప్పట్లో రష్యాలోని తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తే కమ్యూనిస్టుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా రిపీట్ రన్‌లో 100 రోజులుగా పైగా ప్రదర్శించబడింది. 

3 /9

హీరోగా సూపర్ స్టార్ కృష్ణకు 'అల్లూరి సీతారామరాజు' 100వ సినిమా. ఈ చిత్రాన్ని కృష్ణ సొంత నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియో బ్యానర్ పై ఎంతో భారీ ఎత్తున సినిమా స్కోప్‌లో తెరకెక్కించారు. తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ కథను కృష్ణ.. త్రిపురనేని మహారథితో ఆరుగురి సభ్యులతో మన్యం ప్రాంతం ప్రజలను కలిసి ఈ సినిమా స్టోరీని రెడీ చేయించారు.

4 /9

అల్లూరి సీతారామరాజు సినిమాకు త్రిపురనేని మహారథి ఎంతో అద్భుతమైన మాటలు రాసారు. ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.  

5 /9

అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్ ఎక్కువ భాగం చింతపల్లి అడవుల్లో 38 రోజుల పాటు పిక్చరైజ్ చేసారు. ఇక ఇన్‌డోర్ సీన్స్‌ను వాహినీ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరించారు.  

6 /9

అల్లూరి సీతారామరాజు సినిమా కంటే ముందు సూపర్ స్టార్ కృష్ణ.. 'అసాధ్యుడు' సినిమాలో అల్లూరి పాత్రలో ఓ నాటకంలో వచ్చే సీన్‌లో కనిపిస్తారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన వి.రామచంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 70 శాతం షూటింగ్ తర్వాత ఆయన చనిపోవడంతో కే.యస్.ఆర్.దాస్, కొంత భాగాన్ని కృష్ణ డైరెక్ట్ చేసారు. ఒక రకంగా దర్శకుడిగా కృష్ణ ఫస్ట్ మూవీ ఇదే అవుతోంది.

7 /9

అల్లూరి సీతారామరాజు సినిమాకు ఆదినారాయణ రావు సంగీతం అందించారు. ఈ సినిమాలో 'తెలుగువీర లేవరా' పాటకు తొలిసారి జాతీయ అవార్డు వచ్చింది.

8 /9

అల్లూరి సీతారామరాజు సినిమా 1974 మే 1న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు 19 కేంద్రాల్లో 100 రోజులతో పాటు 25 వారాలకు  పైగా నడిచి ఇండస్డ్రీ రికార్డు నమోదు చేసింది. హైదరాబాద్‌లో షిఫ్ట్ సిస్టమ్‌లో యేడాదికి పైగా నడిచింది.

9 /9

1975 మే 1న శోభన్ బాబు అధ్యక్షతన ఈ సినిమా గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లూరి సీతారామరాజు విడుదలైన 20 యేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 'తెలుగు వీర లేవరా' సినిమా చేసారు. ఈ సినిమాను అప్పట్లో రష్యాలోని తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తే కమ్యూనిస్టుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా రిపీట్ రన్‌లో 100 రోజులుగా పైగా ప్రదర్శించబడింది.