Pune Accident: ఇద్దరిని చంపిన వ్యక్తికి కేవలం 300 పదాల వ్యాసం రాయాలని శిక్ష.. కోర్టు తీర్పు వైరల్‌

Pune Porsche Car Accident Minor Gets Bail And Write 300 Words Essay: డబ్బు ఉంటే చట్టం కూడా చుట్టమవుతుందని అందరికీ తెలిసిందే. ఇద్దరి ప్రాణాలు తీసిన నిందితుడికి గంటల వ్యవధిలోనే బెయిల్‌ మంజూరవడమే కాక అతి తక్కువ శిక్ష విధించిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 20, 2024, 10:24 PM IST
Pune Accident: ఇద్దరిని చంపిన వ్యక్తికి కేవలం 300 పదాల వ్యాసం రాయాలని శిక్ష.. కోర్టు తీర్పు వైరల్‌

Pune Porsche Car Accident: లగ్జరీ కారుతో అత్యంత వేగంగా ప్రయాణం చేస్తూ ప్రజలను భీతిల్లేలా చేసి ఇద్దరి ప్రాణాలు బలిగొన్న సంపన్న కుమారుడికి న్యాయస్థానం అతి స్వల్ప శిక్ష విధించింది. 15 గంటల్లోనే బెయిల్‌ మంజూరు చేయగా.. అంతేకాదు అత్యంత సులువైన శిక్షలు వేసింది. ప్రాణాలు తీసిన ధనవంతుల బిడ్డను కేవలం 300 పదాల వ్యాసం రాయాలని, కొన్నాళ్లు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పని చేయాలని తీర్పునిచ్చింది. ఈ వినూత్న తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also Read: Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌.. ఏం జరిగిందంటే?

మహారాష్ట్రకు చెందిన బ్రహ్మ రియాల్టీ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి విశాల్ అగర్వాల్ కుమారుడు వేదాంత్ అగర్వాల్ (17). పీకల దాకా మద్యం తాగి తన లగ్జరీ కారు పోర్షే కారులో పుణెలో బీభత్సం సృష్టించాడు. మద్యంమత్తులో కారును యమ స్పీడ్‌గా పోనిచ్చాడు. ఈ క్రమంలో  పూణే - కళ్యాణి నగర్‌లో కారు అదుపు తప్పి వాహనదారులపై ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు పది మంది గాయపడగా.. చికిత్స పొందుతూ ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మృతి చెందారు.

Also Read: Air India Flight: ట్రక్‌ను ఢీకొన్న ఎయిరిండియా విమానం.. ప్రాణభయంతో ఉలిక్కిపడిన ప్రయాణికులు

ఈ ప్రమాదంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి అత్యంత ఖరీదైన పోర్షే కారును ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు వేదాంత్‌ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్‌ చేసి 15 గంటలు కాకముందే వేదాంత్‌కు బెయిల్‌ మంజూరైంది. మైనర్‌ కావడంతో జువైనల్‌ బోర్డులో వేదాంత్‌ను ప్రవేశపెట్టారు. ఇంకా చిన్నపిల్లాడిగా భావించిన బోర్డు వేదాంత్‌కు స్వల్ప శిక్షలు విధించింది. ఇద్దరి మృతికి కారణమైనా కూడా కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేశారు.

అనంతరం చేసిన ప్రమాదంపై 300 పదాల వ్యాసం రాయాలని ఆదేశించింది. దాంతోపాటు 15 రోజుల పాటు ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పని చేయాలని తీర్పునిచ్చింది. అనంతరం మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని సూచించింది. భవిష్యత్తులో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సహాయం చేయాలని న్యాయస్థానం బాలుడి రూపంలో ఉన్న నిందితుడికి ఆదేశించింది. అయితే ఇద్దరి మృతికి కారణమైన అతడిని దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే వారి విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News