Viral Video: ఇంధన ధరల పెంపునకు Mamata Banerjee వినూత్న నిరసన, Electric Scooterపై ప్రయాణం

Mamata Banerjee Travels On Scooter: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో దీదీ మమతా బెనర్జీకి సరికొత్త అస్త్రం దొరికింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 25, 2021, 12:52 PM IST
  • ఎన్డీఏ ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయ విభేదాలు
  • రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో విమర్శల పర్వం
  • ఈ క్రమంలో దీదీ మమతా బెనర్జీకి సరికొత్త అస్త్రం దొరికింది
Viral Video: ఇంధన ధరల పెంపునకు Mamata Banerjee వినూత్న నిరసన, Electric Scooterపై ప్రయాణం

West Bengal CM Mamata Banerjee Travels On An Electric Scooter In Kolkata: కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో దీదీ మమతా బెనర్జీకి సరికొత్త అస్త్రం దొరికింది.

దేశ వ్యాప్తంగా నిత్యం పెరగుతున్న ఇంధనధరలతో వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల(Petro Diesel Price Hike) పెంపును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో వినూత్నంగా తన నిరసన వ్యక్తం చేశారు. కోల్‌కతా రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రయాణించారు. సామాన్యులు పెట్రోల్, డీజిల్ కొని రోడ్లపై తిరగకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని గత కొన్నిరోజులుగా ఆమె విమర్శిస్తున్నారు.

Also Read: Petrol Price Today: వరుసగా రెండోరోజు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధర, లేటెస్ట్ రేట్లు ఇలా

ఇంధన ధర పెంపునకు నిరసన వ్యక్తం చేస్తూ మమతా బెనర్జీ(Mamata Banerjee) ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రయాణిస్తుండగా వీడియో తీశారు. ఆ వీడియోను ఏఎన్ఐ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

Also Read: DA Hike Latest News: త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, TA మరియు DR అలవెన్సులు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News