Mamata Banerjee Health: మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్ బుల్లెటిన్ విడుదల చేసిన వైద్యులు

Mamata Banerjee Health: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. నామినేషన్ సందర్భంగా ఆమెపై జరిగిన  దాడి అనంతరం కోల్‌కత్తాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 11, 2021, 12:57 PM IST
Mamata Banerjee Health: మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్ బుల్లెటిన్ విడుదల చేసిన వైద్యులు

Mamata Banerjee Health: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. నామినేషన్ సందర్భంగా ఆమెపై జరిగిన  దాడి అనంతరం కోల్‌కత్తాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

పశ్చిమ బెంగాల్ ఎన్నిక(West Bengal Elections)ల్లో వేడి రాజుకుంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామినేషన్ సందర్బంగా ఆమెపై దాడి జరిగింది. కాలికి గాయమవడంతో హుటాహుటిన కోల్‌కత్తాలోని ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. దాడిలో ఆమె ఎడమకాలితో పాటు కుడిభుజం, మెడకు తీవ్రగాయాలయ్యాయి. మరోవైపు ఆమెకు ఛాతీలో నొప్పి ఉందని..శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బుల్లెటిన్ విడుదల చేశారు. 48 గంటల వరకూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకు మరో రెండు నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. 

మరోవైపు ఈ దాడికి నిరసనగా టీఎంసీ నేతలు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి మమతా బెనర్జీ(Mamata Banerjee)పై దాడి నేపధ్యంలో మేనిఫెస్టో విడుదల వాయిదా పడింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాతే మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇంకోవైపు ఈ దాడిని ఎన్నికల కమీషన్ (Election Commission)సీరియస్‌గా తీసుకుంది. రేపటిలోగా దాడిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. నామినేషన్ వేసిన తరువాత తిరిగి బయలుదేరే క్రమంలో మమతాపై దాడి జరిగింది. నలుగురైదుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని..తనపై కుట్ర జరుగుతోందనేది మమతా ఆరోపణగా ఉంది.

Also read: Attack on Mamata Banerjee: మమతా బెనర్జీపై దాడి, నందిగ్రామ్‌లో ఉద్రిక్తత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News