యోగి  'మోడీ సేన' వ్యాఖ్యలకు దీదీ కౌంటర్

                             

Last Updated : Apr 1, 2019, 06:09 PM IST
యోగి  'మోడీ సేన' వ్యాఖ్యలకు దీదీ  కౌంటర్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ‘మోదీ సేన’ఖ్యలపై దుమారం చెలరేగుతోంది. యోగి చేసిన ఈ వ్యాఖ్యలకు బెంగాల్ సీఎం మమత బెనర్జీ గట్టి కౌంటర్ ఇచ్చారు  భారత సైన్యాన్ని కమలం పార్టీ నేతలు తమ సొంత సైన్యంగా పేర్కొనడం సైనికులను అవమానించడమేనన్నారు.  భారత ఆర్మీని చూసి జాతి మొత్తం గర్విస్తుందని.. వారు ప్రతి ఒక్కరికీ చెందిన వారని...  భారత సైన్యం బీజేపీ సొత్తు కాదని...దేశ ప్రజల ఆస్తి అని మమత బెనర్జీ కౌంటర్ ఇచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్‌  ఘజియాబాద్‌లోని ఓ ర్యాలీలో మాట్లాడుతూ భారత సైనిక దళాన్ని 'మోడీ సేన' గా అభివర్ణించారు. ఉగ్రవాదులకు కాంగ్రెస్‌ నేతలు బిర్యానీలు వడ్డిస్తుంటే... కానీ మోడీ సేన ( భారత సైన్యం) బాంబులు, తూటాలు తినిపిస్తోందని యోగి వ్యాఖ్యనించారు . ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఈ క్రమంలో ...యూపీ సీఎం యోగి వ్యాఖ్యలను మమత బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు.

Trending News