Aadhar Card Download: మొబైల్ నంబర్‌ లేకున్నా ఇలా సింపుల్‌గా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

Download Aadhar Without Mobile Number: యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు దారులకు ఓ శుభవార్తను తెలిపింది. ఇకపై ఆధార్ సేవలను మరింత సులభతరం చేసింది. ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి.

Written by - Renuka Godugu | Last Updated : Mar 31, 2024, 09:57 PM IST
Aadhar Card Download: మొబైల్ నంబర్‌ లేకున్నా ఇలా సింపుల్‌గా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

Download Aadhar Without Mobile Number: యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు దారులకు ఓ శుభవార్తను తెలిపింది. ఇకపై ఆధార్ సేవలను మరింత సులభతరం చేసింది. ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి. దానికి ఓటీపీ వస్తుంది. అయితే, ఈ నిబంధనను సడలించింది. ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మొబైల్ నంబర్ అవసరం లేదు. దీనికి మీ వద్ద ఓ అల్టర్‌నేటివ్ నంబర్ ఉంటే సరిపోతంఉది. ఇది రిజిస్ట్రర్డ్‌ మొబైల్ నంబర్ లేనివారికి గుడ్ న్యూస్. గతంలో ఆధార్‌ నమోదు చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నంబర్‌ను తప్పకుండా ఎంటర్ చేయాల్సి వచ్చేంది. ఇప్పుడు రిజిస్ట్రర్డ్‌ మొబైల్ నంబర్ లేకుండా ఆధార్ కార్డును ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.

ఇదీ చదవండి: అయోధ్య రామమందిరం వద్ద పేలుడు.. అలర్ట్ అయిన పోలీసులు..

సాధారణంగా మనకు ఏ ప్రభుత్వ పథకాలు అమలు కావాలన్నా.. బ్యాంకు లావాదేవీలకు కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. ఈ ఆధార్ కార్డు మనకు ఎంతో కీలకం. అయితే, కొన్ని కారణాల వల్ల ఆధార్ కార్డుపై కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఈసేవ సెంటర్లలో కొన్ని గంటల తరబడి ఎదురు చూస్తూ ఆధార్ సేవలను పొందుతాం. ఇలా కాకుండా మనం కూడా ఆన్‌లైన్ ఆధార్‌ పై మార్పులు చేసుకోవచ్చు. 

ఆధార్ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం..

  1. మొదటగా UIDAI అధికారికి వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. అందులో 'MY Aadhar' ను క్లిక్ చేయాలి
  2. ఆ తర్వాత 'Order Aadhar Reprint' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. అప్పుడు మిమ్మల్ని 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆధార్ నంబర్‌కు బదులు మీరు 16 డిజిట్స్ వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VID) కూడా ఎంటర్ చేయవచ్చు.
  4. వీఐడీ నంబర్ నమోదు చేసిన వెంటనే సెక్యూరిటీ క్యాప్చా కోడ్ నమోదు చేయాల్సి ఉంటుంది.
  5. ఇప్పుడు మీ వద్ద రిజిస్ట్రర్డ్‌ మొబైల్ నంబర్ లేకున్నా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలంటే 'My Mobile Number Is Not Registered' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  6. అయితే, ఇక్కడ మీరు అల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.

ఇదీ చదవండి: ఢిల్లీలో షాకింగ్ ఘటన.. పట్టపగలే యువతిపై కత్తిపోట్లు.. వైరల్ గా మారిన వీడియో..

  1. ఆ తర్వాత "send OTP' ఎంపిక చేసుకోవాలి. అప్పుడు ఆ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత చెక్‌బాక్స్ షరతులపై క్లిక్ చేసి చివరగా సబ్మిట్ బట్టన్ క్లిక్ చేయాలి.
  2. చివరగా మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. రీప్రింట్ వెరిఫికేషన్ కోసం అందులో ఆధార్ కార్డు ప్రివ్యూ కనిపిస్తుంది. అప్పుడు 'Make Payment' ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అయితే, ఇలా ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకునే ముందు డిజిటల్ సిగ్నేచర్ అందుబాటులో పెట్టుకోవాలి. చివరగా ఓ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ కూడా మీ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్‌ వస్తుంది. మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి ఆ నంబవర్ ఉపయోగపడుతుంది. చివరగా ఆధార్ లెట్టర్ మీ ఇంటికి పోస్ట్‌ ద్వారా చేరుతుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News